twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా షూటింగ్ కాదు.. లేటుగా వస్తావా? అనన్య పాండేపై ఎన్సీబీ అధికారుల ఫైర్

    |

    ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేపడుతున్న ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపడేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.

    బాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే భారీగా ముడుపులు అందుకొన్నారు. మాల్దీవులకు వెళ్లి సినీ తారల నుంచి భారీగా లంచాలు వసూలు చేశాడు. తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షి కేవీ గోసవి నాకు వాట్సప్‌లో ఓ ఫోటో పంపించారు. క్రూయిజ్‌లోకి వెళ్లే సమయంలో కొందరిని గుర్తించమని అడిగారు. నాతో బలవంతంగా ఎన్సీబీ సంతకం చేయించింది. సామ్ డిసౌజా అనే వ్యక్తితో ముడుపుల గురించి గోసవి మాట్లాడారని ఎన్సీబీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. గోసవి షారుక్ ఖాన్ టీమ్‌తో ముఖ్యంగా మేనేజర్‌ పూజ దల్దానిని కలిసి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే 18 కోట్లకు డీల్ సెట్ అయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సమీర్ వాంఖడే ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది.

    Sameer Wankhede and NCB warns Actor Ananya Panday over in Drugs investigation

    ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా తాను మాట్లాడటం సరికాదు అని అన్నారు. నాపై వస్తున్న ఆరోపణలన్నింటికి సమాధానం ఇస్తాను. ఈ ఆరోపణల నేపథ్యంలో నాకు సమన్లు అందలేదు. నేను వేరే పనిమీద ఢిల్లీకి వచ్చాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం అని సమీర్ వాంఖడే అన్నారు.

    అయితే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేపై విచారణపై సమీర్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వాట్పాప్ ఛాటింగ్ విషయంలో గురు, శుక్రవారం ఆమెను ప్రశ్నించాం. కానీ ఆమె రెండు రోజులు ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. అయితే ఆలస్యంగా వచ్చిన అనన్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని, ఇది సినిమా షూటింగ్ కాదు. ఎన్సీబీ ఆఫీస్ ప్రొడక్షన్ హౌస్ కాదని హెచ్చరించినట్టు మీడియా కథనాలు వచ్చాయి.

    అయితే సోమవారం విచారణకు హాజరు కావాలని అనన్యపాండేను కోరగా.. ముందస్తు అపాయింట్‌మెంట్స్ కారణంగా విచారణకు హాజరుకాలేనని ఆమె తెలిపారు. అందుకే విచారణ నిలిచిపోయింది. త్వరలోనే మరోసారి ఆమెను ప్రశ్నిస్తాం అని అధికారులు వెల్లడించారు.

    English summary
    Sameer Wankhede condemns allegations by Gosavi. He said, I have not been summoned. I've come here for a different purpose. Allegations against me are baseless," Wankhede said at the airport.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X