గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ప్రెగ్నెన్సీతో ఫోజులు!
హీరోయిన్ సమీరా రెడ్డి అందరికి గుర్తుండే ఉంటుంది. అందం, అభినయం అన్ని కలబోసిన నటి సమీరా రెడ్డి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అలరించింది. కుర్రకారు సమీరారెడ్డి అందాలకు ఫిదా అయ్యేవారు. ఆమె తెలుగులో నటించిన చిత్రాలు విజయం సాధించలేదు. కానీ సమీరా రెడ్డికి మాత్రం మంచి క్రేజ్ ఉంది. చాలా రోజుల తర్వాత సమీరా రెడ్డి ఓ ఈవెంట్ లో మెరిసింది. సమీరా రెడ్డిని చూసిన ప్రతి ఒక్కటూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి తర్వాత
సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్ధే అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం సమీరా సినిమాలకు దూరమైంది. ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం సమీరా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తల్లిగా తన భాద్యత నిర్వహిస్తోంది. సౌత్, బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసిన సమీరా రెడ్డి స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకుంది. పెళ్ళైన తర్వాత సమీరా పెద్దగా మీడియాకు కానీ, పబ్లిక్ లో కానీ కనిపించలేదు.

గర్భవతిగా
తాజాగా సమీరా రెడ్డి లక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్ కు హాజరైంది. గర్భవతిగా ఉన్నా ఆమె ఈ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. ఈవెంట్ లో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. అప్పట్లో హీరోయిన్ గా మెరిసిన సమీరాని ఈ లుక్ లో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని కామెంట్స్ పడుతున్నారు. సమీరా రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు చిత్రాలు
సమీరారెడ్డి నరసింహుడు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జైచిరంజీవ, అశోక్ లాంటి చిత్రాల్లో నటించించింది. సమీరా రెడ్డి చివరగా టాలీవుడ్ లో మెరిసిన చిత్రం కృష్ణం వందే జగద్గురుమ్. అది కూడా స్పెషల్ సాంగ్ మాత్రమే. ఆ తర్వాత సమీరా రెడ్డి మరో చిత్రం చేయలేదు. హిందీలో రేస్ లాంటి స్టైలిష్ చిత్రాల్లో సమీరా రెడ్డి నటించింది. గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు కూడా సమీరా వెనకాడలేదు.

రీఎంట్రీ ఇచ్చే అవకాశం
ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు వివాహం జరిగాక కొంత గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. సమీరా రెడ్డి ఆ దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున సమీరా ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్ లో నటించే అవకాశం ఉంది. అందుకేనెమో లక్మే ఫ్యాషన్ వీక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.


Click it and Unblock the Notifications











