కూతురుకి వెరైటీగా పేరు పెట్టిన సమీరా రెడ్డి!

బాలీవుడ్ నటి సమీరా రెడ్డి ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారు. తమ కుటుంబంలోకి మహాలక్ష్మి వచ్చిందంటూ ఫ్యామిలీ మెంబర్స్ పండగ చేసుకుంటున్నారు. వీరి ఆనందానికి కారణం సమీరా కొన్ని రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనివ్వడమే.

తాజాగా సమీరా రెడ్డి తన కూతురుకు ఏం పేరు పెట్టారో వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'నైరా' అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. నైరా అనేది సంస్కృత పదం. గులాబి, సరస్వతి దేవి అందం అని అర్థం. తన నాలుగేళ్ల కుమారుడి ద్వారా నైరా పేరును ఓ బోర్డుపై రాసి సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

Sameera Reddy baby’s girl name as Nyra

కాగా... బిడ్డ పుట్టిన తర్వాత సమీరా రెడ్డి తన సోషల్ మీడియా పేజీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మీ బిడ్డ ఎవరి పోలిక అనే ప్రశ్నకు సమీరా రెడ్డి స్పందిస్తూ.. 'నా బిడ్డ నాలా నల్లగా లేదు. తెల్లగా, ముద్దుగా ఉన్నందుకు హ్యాపీగా ఉంది' అంటూ సమాధానం ఇచ్చారు.

సమీరా తన బిడ్డ రంగును పోలుస్తూ ఇలాంటి కామెంట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక బాధ్యత గల సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి పోలిక చేయడం సరైంది కాదని, అలా మాట్లాడటం నల్లగా ఉండే వారిని అవమానించడమే అనే కొందరు విమర్శించారు.

సమీరా రెడ్డి-అక్షయ్ వర్దె దంపతులకు ఈ పాప రెండో సంతానం. వారికి ఇప్పటికే హన్స్ వాద్రే అనే మూడేళ్ల కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. కూతురు పుట్టడంతో ఆమె పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే అని, ఆమె తన సమయం మొత్తం కూతురు ఆలనా పాలన కోసమే కేటాయించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X