నేను ఆ టైప్ కాదని, నాతో పనిచేయనన్నాడు... క్యాస్టింగ్ కౌచ్ పై సమీరా రెడ్డి

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ, క్యాస్టింగ్ కౌచ్ సంప్రదాయం చాపకింద నీరులా సాగుతూనే ఉంది. మీటూ పుణ్యామాని పులువురు తారలు తమకు జరిగిన అన్యాయాన్ని, ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెడుతూ ఈ హేమైన సంప్రదాయంపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ సమీరా రెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

ఇటీవలే తల్లి అయిన సమీరా రెడ్డి, ఈ మధ్య ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను ఎదుర్కొన్న చేతు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తానూ రెండు సార్లు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత, స్క్రిప్ట్ లోకి సడన్ గా ముద్దు సీన్లు జొప్పించారని, సినిమాకు సంతకాలు చేసినప్పుడు దాని గురించి ప్రస్తావించలేదని తెలిపింది. అప్పటికే ముసాఫిర్ అనే సినిమాలో తాను కిస్సింగ్ సీన్ చేసినందున, ఇప్పుడు కూడా చేయాలని దర్శక-నిర్మాతలు తనపై ఒత్తిడి తెచ్చారని వివరించింది. ఒకసారి చేసినంత మాత్రాన్ని ప్రతీసారి చేయలేనని తాను స్పష్టం చేయడంతో, తనని సినిమా నుంచి తీసేస్తామని బెదరించారని వల్లడించింది సమీరా.

Sameera Reddy on Casting Couch, opens about her bad experience.

మరో ఘటనలో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరో తనను వేధించిన వైనాన్ని గుర్తుచేసుకుంది. తాను ఆ టైప్ కాదని, చాలా బోరింగ్ అని, ఇంకోసారి తనతో కలసి పనిచేయనని సదరు హీరో తన ముఖం మీదే కారాలూ మిరియాలూ నూరిన వైనాన్ని గుర్తుచేసుకుంది. అతరువాత అతిడితో ఎప్పుడూ కలసి పనిచేయలేదని తెలిపింది. అయితే, ఈ పరిశ్రమలో అడుగడుగునా ఇలాంటి రాబందులు ఎందరో ఉంటారని, వారి నుంచి తమని తాము రక్షించుకునేందుకు ఆత్మరక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది సమీరా. వైకుఠపాళిలో పాములను తప్పించుకుని పైకి ఎగబాకినట్లే, ఇక్కడా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X