twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Samrat Prithviraj: బాలీవుడ్ సినిమాకు కోలుకోలేని దెబ్బ.. 150కోట్లు పెడితే ఎంత వసూలైందంటే?

    |

    అక్షయ్ కుమార్ మనిషి చిల్లర జంటగా నటించిన పురాణ చారిత్రాత్మక చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ ఇటీవల భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందు క్రియేట్ అయిన బజ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరు అనుకున్నారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని రాజ్‌పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా 7 రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

    150 కోట్ల బడ్జెట్

    150 కోట్ల బడ్జెట్


    ఇక పృథ్వీరాజ్ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఏ ఖర్చు చేసినట్లు సమాచారం. దాదాపు 150కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. పృథ్వీరాజ్ సినిమాకు మొదటి రెండు మూడు రోజుల కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ వీకెండ్స్ అనంతరం పూర్తిగా తగ్గుతూ వచ్చాయి. రివ్యూలు బాగానే వచ్చినప్పటికీ కూడా జనాలు అనుకున్నంతగా ఆసక్తి చూపలేదు.

    బాక్సాఫీస్ దెబ్బ

    బాక్సాఫీస్ దెబ్బ

    సోమవారం నుంచి పృథ్వీరాజ్ కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అవుతూ వచ్చయి. సినిమా పై పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ప్రేక్షకుల అంచనాలు మారిపోవడంతో బాక్సాఫీస్ వద్ద దెబ్బ పడుతోంది.

    కలెక్షన్స్ ఎంతంటే?

    కలెక్షన్స్ ఎంతంటే?

    ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సామ్రాట్ పృథ్వీరాజ్ పోరాడుతూనే ఉన్నాడు అంటూ ఫస్ట్ వారం లో మొత్తం రూ.55.5 కోట్లు వచ్చాయని శుక్రవారం 10.70 కోట్లు, శని 12.60 కోట్లు, ఆదివారం 16.10 కోట్లు, సోమవారం 5 కోట్లు, మంగళవారం 4.25 కోట్లు, బుధవారం 3.60 కోట్లు. మొత్తంగా 7 రోజుల్లో ₹ 52.25 కోట్లు వచ్చినట్లు సమాచారం.

    సగం అయినా వస్తుందా?

    సగం అయినా వస్తుందా?


    ఈ సినిమా కోసం దాదాపుగా 150 కోట్ల వరకు ఖర్చు చేసిన నిర్మాతలకు అందులో సగం కూడా వస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు కానీ మొదటి వారం తప్పితే వీకెండ్స్ అనంతరం ఈ సినిమా ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. బాక్సాఫీస్ వద్ద నష్టాలు రాకుండా ఉండాలి అంటే మరో వంద కోట్ల వసూళ్లను అందుకోవాలి.

    బిగ్గెస్ట్ డిజాస్టర్

    బిగ్గెస్ట్ డిజాస్టర్


    ఇక మొదటి మూడు రోజుల్లోనే మొత్తంగా ఈ సినిమా కేవలం 50 కోట్లు మాత్రమే సాధించింది. దీంతో మిగతా కలెక్షన్లు లో రావడం అనుమానంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాను తెలుగులో కూడా బాగానే ప్రమోట్ చేశాడు. కానీ ఏ ప్లాన్ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. సినిమా రిలీజ్ అయినప్పటి రాజకీయా అంశాలలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూసిన అక్షయ్ కుమార్ కు మరొక నిరాశ కలిగింది అనే చెప్పాలి. వరుసగా బాలీవుడ్ సినిమాలు ఎదుర్కొంటున్న ఫలితాల్లో ఇది కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Samrat Prithviraj first week 7 days box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X