బండారం బట్టబయలైంది.. అందుకే అతని నుంచి విడిపోయాను.. హీరోయిన్ బ్రేకప్ స్టోరీ

అందరూ ప్రేమలో పడుతుంటారు.. విడుపోతుంటారు. మళ్లీ ఈ చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది. అయితే మామూలు జనాల్లో ఇలాంటివి జరిగితే అంతగా పట్టించుకోరు కానీ.. అదే సెలెబ్రిటీల విషయంలో అయితే మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇక అవే వార్తలు కనిపిస్తాయి. తాజాగా హీరోయిన్ సనాఖాన్ బ్రేకప్ స్టోరీ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు రోజుల్లో సనాఖాన్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.

టాలీవుడ్‌లో మెరిసిన సనా ఖాన్..

టాలీవుడ్‌లో మెరిసిన సనా ఖాన్..


టాలీవుడ్ అడపాదడపా చిత్రాల్లో మెరిసింది సనా ఖాన్. అయితే ఏ ఒక్క చిత్రమూ ఆమెకు ఫేమ్, నేమ్ తీసుకురాలేకపోయాయి. కళ్యాణ్ రామ్‌కు జోడీగా ‘కత్తి', మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. నాగార్జున ‘గగనం' సినిమాలో చిన్న పాత్రను పోషించింది.

ఏడాది క్రితం మొదలైన ప్రేమ..

ఏడాది క్రితం మొదలైన ప్రేమ..

సనా ఖాన్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో ప్రేమలో పడ్డట్టు తామిద్దరం రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు గతేడాది ప్రకటించింది. ‘ఇతనంటే నాకు ప్రాణం. జీవితంలో ఇతను తోడుంటే చాలు. అంతకుమించి ఏమీ అవసరం లేదు' అంటూ ఎంతో ఎమోషనల్‌గా ట్వీట్ చేసింది.

బండారం బట్టబయలైంది..

బండారం బట్టబయలైంది..


అయితే సరిగ్గా ఏడాది గడిచిందో లేదో.. ఆ ప్రేమ కథ కంచికి చేరింది. అతని బండారం బయట పడటంతో బ్రేకప్ చెప్పేశానని ప్రకటించింది సనాఖాన్. అతని నిజ స్వరూపం తెలిసే సరికి మోసపోయానని మీడియా ముందుకు వచ్చి కన్నీరుపెట్టుకుంది. దీంతో ఆమెకు చాలా మంది సెలెబ్రిటీలు, నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

Recommended Video

Disha Patani Signed Salman Khan's Bharat | Filmibeat Telugu
మరో అమ్మాయితో రాసలీలలు..

మరో అమ్మాయితో రాసలీలలు..

అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పుకొచ్చింది. కానీ అతను మరో అమ్మాయితో రాసలీలలు కొనసాగిస్తూ మోసం చేసాడని అతని గుట్టు రట్టు చేసింది. కొన్ని రోజుల క్రితం అతని తీరుపై అనుమానం వచ్చిందని తెలిపింది. అతని ఫోన్ చెక్ చేస్తుంటే వెంటనే లాక్కుని మెసేజ్‌లు డిలీట్ చేయడం మొదలుపెట్టాడని.. తనను మోసం చేస్తున్నాడని ఆ సమయంలోనే అర్థమైందని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X