‘నా ప్రియుడు బై సెక్సువల్.. రాసలీలలు కళ్లారా చూశా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నా..’
బాలీవుడ్ అందాల భామ సనాఖాన్ మరోసారి తన ప్రియుడి బాగోతాన్ని బయటపెట్టారు. కొరియోగ్రాఫర్ మాలెవిన్ లూయిస్‌తో బ్రేకప్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ రేపిన సంగతి తెలిసిందే. గతంలో ఒకరికొకరు తమపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసుకోవడం, వాటిని ఖండించుకోవడం వివాదంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వారి వాగ్వాదం ఇంకా డైలీ సీరియల్‌గా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు మీడియాలో హీట్ పెంచుతున్నది. వివరాల్లోకి వెళితే..

ఆయన చీకటి కోణం
జీవితంలో ఎవర్నీ నమ్మని విధంగా నా మాజీ ప్రియుడు మాలెవిన్ లూయిస్ నమ్మాను. ఆయనలోని చీకటి కోణం తొలినాళ్లలోనే బయటపడటం అదృష్టంగా భావిస్తున్నాను. నాతో అఫైర్ కొనసాగిస్తూనే మరొకరితో లైంగిక చర్యలకు పాల్పడం నా దృష్టికి రావడం, ఆ క్రమంలోనే నా చేతికి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం నా జీవితానికి మేలు చేసింది. నేను అతడిని గుడ్డిగా నమ్మి మోసపోయాను. కానీ అది డేటింగ్ ఆరంభంలోనే బయటపడటం ఏదో జన్మలో చేసుకొన్న పుణ్యంగా భావిస్తున్నా అని సనా ఖాన్ అన్నారు.

రాసలీలలు చూడాల్సిన దుర్మార్గం
తాజాగా ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో సనా ఖాన్ ముచ్చటిస్తూ.. నా కళ్లతోనే అతడి రాసలీలు చూడాల్సిన దుర్మార్గం నాకు కలిగింది. అతడి నిజస్వరూపం నా దృష్టికి రావడం అదృష్టమే. ఆయన వ్యవహారాలను రెడ్ హ్యాండెడ్‌గా చూసి షాకయ్యాను. నేను ఎవరో చెప్పిన మాటలు వింటే నా తప్పు అనుకోవచ్చు. అంతా కళ్లతోనే చూశాను కాబట్టి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని సనా ఖాన్ పేర్కొన్నారు.

నిజస్వరూపం చూసి
నేను నమ్మిన వ్యక్తి నాకు మోసం చేస్తారనే విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎవరో చెప్పిన మాటలు వింటే మనసు కకావికలం అయ్యేది. కానీ ఆ విషయాలు కళ్లారా చూసిన తర్వాత మనిషిగా కోలుకోలేకపోయాను. ఓ మనిషి నిజస్వరూపం తెలుసుకొనే అవకాశం ఇచ్చిన భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీవితానికి దేవుడు మరో అవకాశం ఇచ్చాడని భావిస్తున్నాను అని ఓ ప్రశ్నకు సమాధానంగా సనా ఖాన్ అన్నారు.
Recommended Video

ఆయన మాజీ ప్రియురాలి విషయం
నా ప్రియుడు బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కుడు). నాతో అఫైర్‌కు ముందు ఆయనకు మరో అమ్మాయితో రిలేషన్ ఉంది. ఆ అమ్మాయికి చాలా మంది అబ్బాయిలతో సంబంధాలు ఉండేవని నాతో చెప్పుకొని బాధపడ్డారు. అమ్మాయి లెస్పియన్ అని చెప్పాడు. ఆమెకు మరికొంత మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని చెప్పి వాపోయాడు. అలాంటి వాడు నాకు ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు అని సనా ఖాన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











