Don't Miss!
- Sports
నేను అనుకున్న సవాల్ ఎదురవ్వలేదు.. అతి త్వరలోనే సెంచరీ కొడతా: రోహిత్ శర్మ
- News
టీడీపీ డ్యామేజ్ కంట్రోల్- అయ్యన్నపై చర్యలు తీసుకోక తప్పదా..?!
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
సుశాంత్ సింగ్ ఫ్రెండ్ సందీప్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్టు.. అంత్యక్రియలు నిలిపివేత.. ఎందుకంటే!
బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సహ నటుడు, స్నేహితుడు సందీప్ నహర్ ఆత్మహత్య సంఘటన అందర్నీ కలిచి వేసింది. భార్యతో గొడవలతో విసిగిపోయిన సందీప్ ఫిబ్రవరి 16వ తేదీన సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంలో సందీప్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

సీలింగ్‌కు ఉరి వేసుకొని సూసైడ్
సందీప్ తన నివాసంలోని సీలింగ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. సందీప్ సీలింగ్ వేలాడుతుండటాన్ని భార్య కంచన్, ఇతర కుటుంబ సభ్యులు చూసి వెంటనే ఆయన దేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే సందీప్ మరణించారని వైద్యులు ధృవీకరించారు.

ఎప్పుడో చావాలని అనుకొన్నా.. సూసైడ్ నోట్
ఫేస్‌బుక్‌లో సందీప్ పోస్టు చేసిన వీడియోను సూసైడ్ నోటుగా పరిగణిస్తున్నారు. ఈ పోస్టులో నా మరణం ఎప్పుడో ఖాయమైంది. కానీ పరిస్థితులు మెరుగుపడుతాయని, నేనే దానిని కాస్త ఆలస్యం చేశాను. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. నా మరణం తర్వాత నా భార్య కంచన్‌ను ఏమీ అనకూడదు అంటూ వెల్లడించారు.

మరణానికి ముందు హింసించి ఉంటారేమో
అయితే సందీప్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకొనేలా కొందరు ప్రేరేపించారు. మరణానికి ముందు ఆయనను హింసించి ఉంటారు. లేదా దాడి చేసి ఉండవచ్చు అంటూ భార్య కంచన్, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంత్యక్రియలు నిలిపివేత
ఇదిలా ఉండగా, సందీప్ నహార్ అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలేదు. ఆయన దేహానికి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. ఆ పోస్టుమార్టం రిపోర్టులు ఇంకా అందని కారణంగా అంత్యక్రియలను నిర్వహించలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్టు మార్టం రిపోర్టు అందిన తర్వాత హర్యానాలోని తన సొంత గ్రామంలో అంత్య క్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

యాక్టర్‌గా సందీప్ నహార్ సినిమాలు
నటుడు సందీప్ నహార్ కెరీర్ విషయానికి వస్తే.. ఎంఎస్ ధోని చిత్రం తర్వాత అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన భూటాసింగ్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. 2019లో సోనాక్షి సిన్హా, ర్యాపర్ బాద్షా నటించిన ఖాన్‌దానీ షఫాఖనా చిత్రంలో కూడా నటించారు.