Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మద్యం మత్తులో దాడి కాదు.. మీరు తప్పుగా అర్థం.. సమంత, చిన్మయికి సందీప్‌రెడ్డి కౌంటర్
బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కబీర్ సింగ్ కుదిపేస్తుంటే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. జూలై 6న ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. బాలీవుడ్ క్రిటిక్స్‌పై మండిపడ్డారు. హిందీలో చాలా మంది క్రిటిక్స్‌కు సినిమా గురించి తెలియదని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్య ఉంటే, వారిద్దరూ కొట్టుకోవడం సహజం. దానిని పురుష దురహంకారంగా కొందరు పేర్కొనడం తప్పు అని సందీప్ రెడ్డి ఘాటుగా జవాబిచ్చారు. ఆ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.
సందీప్ రెడ్డిపై నెటిజన్ల ఫైర్
ప్రేమికులు ఒకరినొకరు కొట్టుకోవడం తప్పు కాదు అని సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు విడుచుకుపడుతున్నారు. సమంత అక్కినేని, ఇతర నటీనటులు కూడా దర్శకుడి వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గాయని చిన్మయి కూడా సందీప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. నా భర్త నన్ను ఎప్పుడూ కొట్టలేదు. అలాగని మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని అర్థమా అనే విధంగా కామెంట్లు చేశారు.
ముందు సినిమా చూసి మాట్లాడాలి
తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న రియాక్షన్‌పై సందీప్ రెడ్డి స్పందించాడు. నా వ్యాఖ్యల వక్రీకరణ జరుగుతున్నదని ఆయన అన్నారు. ముందు మీరు సినిమా చూడండి. మీకు నచ్చకపోతే చెప్పండి. హీరో, హీరోయిన్లు కొట్టుకోవడం దాడి కాదు. లైంగికపరమైన వేధింపు అసలే కాదు. మద్యం మత్తులో హీరో వచ్చి కొట్టలేదు. వారి మధ్య ఎమోషనల్ సంఘటనలు ఉన్నాయి అని సందీప్ రెడ్డి వెల్లడించారు.
ప్రేమికులు కొట్టుకోవడం తప్పు కాదు
కబీర్ సింగ్ సినిమాలో ప్రేమికులు గొడవపడటం, కొట్టుకోవడమనే సన్నివేశాలు వారి మధ్య ఉన్న స్వేచ్ఛను తెలియజేస్తాయి. పీకల్లోతూ ప్రేమలో ఉండి.. భావోద్వేగంతో ఉన్న సమయంలో అమ్మాయి అబ్బాయిని, అబ్బాయిని అమ్మాయిని కొట్టడం తప్పేమీ కాదు. ఆ సన్నివేశాలను తప్పుగా అర్ధం చేసుకొంటున్నారు అని సందీప్ రెడ్డి వంగ వెల్లడించారు.
రూ.300 కోట్ల క్లబ్‌లోకి
అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్‌గా రూపొందిన కబీర్ సింగ్ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. సినీ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరిచినా సినిమా కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం రూ.250 కోట్లకు చేరువైంది. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు వ్యక్తం చేస్తున్నారు.