twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranbir Kapoor's Animal: కొత్త సంవత్సరం రోజే సందీప్ రెడ్డి వంగ సీటీ మార్!

    |

    అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ల్లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రం స్పెషల్ వీడియోకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ హీరోగా తెరకెక్కనున్న యనిమల్ అనే చిత్రం స్పెషల్ వీడియోను నూతన సంవత్సరం కానుకగా రిలీజ్ చేశారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కిషన్‌కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణితి చోప్రా నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రణ్‌బీర్ సింగ్ డైలాగ్స్‌తో విడుదల చేశారు. ఈ వీడియోలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. నాన్న... వచ్చే జన్మలో మీరే నాకు బిడ్డగా పుట్టాలి. అప్పుడు నేను ఎంతగా ప్రేమిస్తానో చూసి నేర్చుకో. ఎందుకంటే మరో జన్మలో నీకు నేను బిడ్డగా, నాకు నీవు తండ్రిగా పుడుతావు కనుక. అప్పుడు నేను చూపించిన ప్రేమ మాదిరిగా కాకుండా నీవు కురిపించే ప్రేమ మరింత గొప్పగా ఉండాలి. నీకు అర్ధమవుతుందా నాన్న.. నీవు అర్ధం చేసుకొంటూ అదే చాలు నాకు అనే ఎమోషనల్ డైలాగ్స్‌తో వీడియో ముగిసింది.

    Sandeep Reddy Vanga and Ranbir Kapoors Animal video goes viral

    రణ్‌బీర్ డైలాగ్స్ ముగియగానే విపరీతమైన బుల్లెట్ శబ్దాలతో స్పెషల్ వీడియో మార్మోగింది. ఆ వీడియోను టీ సిరీస్ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. కొత్త సంవత్సరం ఆరంభం.. గట్టిగా సీటి కొట్టే మాదిరిగా ఉండాలన్నదే మా ప్రయత్నం. రణ్‌బీర్, సందీప్ రెడ్డి వంగ సినిమా ఫన్‌తో మొదలైంది అంటూ మెసేజ్‌ను షేర్ చేశారు.

    English summary
    Star Director Sandeep Reddy Vanga movie with Ranbir Kapoor on T Series and Bhadrakali Pictures. The team to released A video on the 1st day of 2021 at 12:01 am on T-series' official YouTube channel. Saal ki shuruwat, seeti marke honi chahiye! Presenting #Animal, starring #RanbirKapoor. Let the fun begin!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X