నీ నిజస్వరూపం ఇదేనా? డర్టీ అంటూ టాప్ హీరోయిన్‌పై సందీప్ రెడ్డి వంగ ఫైర్

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి డర్టీ పీఆర్ గేమ్స్ చేయకు అంటూ తీవ్రంగా మందలించాడు. తాజాగా బాలీవుడ్‌లో స్పిరిట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇటీవల దీపిక పదుకోన్‌ను స్పిరిట్ మూవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే స్పిరిట్ మూవీ నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో దీపిక పదుకోన్‌ను ఉద్దేశించి నర్మగర్భంగా ట్వీట్ చేస్తూ పరోక్షంగా ఫైర్ అయ్యాడు. అసలు వివాదం వెనుక అసలు కథ ఏమిటి? దీపిక పీఆర్ టీమ్ ఏం చేసింది? సందీప్ రెడ్డి కోపానికి కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

తొలుత ప్రభాస్‌తో తీస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకోన్‌ను తీసుకోవాలని సందీప్ రెడ్డి భావించారు. ఆమెకు తన పాత్ర, సినిమా కథను వివరించారు. అయితే కథ, తన పాత్ర విన్న తర్వాత ఆమె కోరిన గొంతెమ్మ కోరికలకు, డిమాండ్లకు టీ సిరీస్ నిర్వాహకులు, సందీప్ షాక్ తిన్నారు. తన రెమ్యునరేషన్‌గా 30 కోట్ల రూపాయలతోపాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా రోజుకు 8 గంటల షిష్ట్ కాకుండా కేవలం 6 గంటలకే పనిచేస్తానని చెప్పిందట. అందుకే ఆమెను ఈ సినిమా కోసం తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు అని బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే తన ట్వీట్‌లో తెలిపారు.

Sandeep Reddy Vanga Blasted Deepika Padukone

అంతేకాకుండా షూటింగ్ సమయంలో తెలుగు వెర్షన్ చిత్రీకరణ సమయంలో తెలుగు డైలాగ్స్ పలకను అని చెప్పారు. అలాగే మొత్తంగా 26 మంది స్టాఫ్ తనతో ఉంటారు. వారికి సంబంధించిన జీతాలు, భత్యాలు నిర్మాతనే చూసుకోవాలి అనే డిమాండ్ క్లియర్‌గా పెట్టారు. దాంతో సందీప్ రెడ్డి వంగ మీరు మాకు అవసరం లేదని చెప్పారు. దాంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు అని కేఆర్కే తన ట్వీట్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు.

సోమవారం రాత్రి (మే 26వ తేదీన) సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేస్తూ.. మా మధ్య ఆ కథను ఎవరికీ చెప్పొద్దు అనే ఓ అగ్రిమెంట్ అధికారికంగా లేదు. .. అయినా ఆమెపై 100 శాతం నమ్మకంతో ఓ యాక్టర్‌కు నా స్టోరినీ నేరేట్ చేశాను. కానీ ఈ సినిమా నుంచి తప్పుకొన్న తర్వాత నా కథను రివీల్ చేసి.. చాలా దారుణంగా బిహేవ్ చేసింది అంటూ సందీప్ రెడ్డి వంగా ట్వీట్‌లో పేర్కొన్నారు.

నా కథలోని పాత్రను బయటకు లీక్ చేసి ఓ యంగ్ యాక్టర్‌ను కెరీర్‌ను, భవిష్యత్‌ను నాశనం చేసే ప్రయత్నం చేసింది. నీవు చెప్పే ఫెమినిజం ఇదేనా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. నాకు సినిమానే జీవితం. ఎన్నో ఏళ్లు కష్టపడి నా క్రాఫ్ట్‌తో డైరెక్టర్‌గా మారాను. కానీ నీకు ఆ విషయంపై పట్టింపు లేదు. నీవు దానిని పట్టించుకోలేదు. నీకు ఆ విషయం ఎప్పటికీ అర్ధం కాదు అని సందీప్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

ఇకనైనా నీవు నీ డర్టీ పీఆర్ గేమ్స్ ఆపు. నీ చేష్టలు చూసిన తర్వాత ఓ సామెత గుర్తుకు వస్తున్నది. 'గోతిలో పడి పిల్లర్‌ను గీకిన పిల్లిలా' (కుందక్ మే బిల్లీ నోచే) అంటూ హిందీలో సామెతను పోస్ట్ చేశాడు. అయితే తాను దీపిక పదుకోన్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేసినప్పటికీ.. గత వారం రోజులుగా దీపిక పదుకోన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిందనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు అధికారికంగా సందీప్ రెడ్డి ప్రకటించాడు. ఈ వ్యవహారంపై దీపిక ఏదైనా రియాక్ట్ అవుతుందా? లేదా తన పీఆర్ గేమ్స్‌ను ఇలాగే కొనసాగిస్తుందా? అనేది వేచి చూడాలి. ఈ వివాదం గురించి మరిన్నీ ఆప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X