Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ ఒప్పుకోకపోతే ఏంటి.. బాలీవుడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. తెలుగోడికి బంపర్ అఫర్
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన దర్శకులు సత్తా చాటుతున్నారు. మొదట్లో మన సినిమాలు రీమేక్ మాత్రమే చేసే అక్కడి స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో మాత్రం ఒరిజినల్ దర్శకులకే కెప్టెన్ గా పగ్గాలు అప్పగిస్తున్నారు. ఇక ఇటీవల మన హీరో రిజెక్ట్ చేసిన దర్శకుడికి బాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ దొరికింది. మంచి బాలీవుడ్ హీరోను పట్టేసినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. సందీప్ రెడ్డి వంగా.
ఆ సినిమా హిట్టవ్వగానే..
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవరం లేదు, ఆ సినిమా అనంతరం సందీప్ ను చాలా మంది హీరోలు ఫోకస్ చేశారు. అతనితో సినిమా కూడా చేయాలనీ అనుకున్నారు. ఎంతో మంచి నిర్మాతలు కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
మహేష్ తో సందీప్ సినిమా..
కానీ సందీప్ మాత్రం తొందరపడలేదు. నెక్స్ట్ సినిమా ఉహలకందని విధంగా ఉండాలని అనుకున్నాడు. అందుకే మహేష్ బాబును కలిశాడు. అర్జున్ రెడ్డి సినిమాపై మహేష్ పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే, అయితే మహేష్,సందీప్ కొన్ని రోజుల పాటు ట్రావెల్ అయ్యారు. వారిద్దరి మధ్య ఒక స్టోరీ డిస్కషన్ కూడా నడిచింది.
మహేష్ ఒప్పుకోకపోవడంతో..
అయితే ఏమయ్యిందో ఏమో గాని మహేష్ చివరికి అతనితో చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఆ తరువాత సందీప్ బాలీవుడ్ లోనే అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఆ కాన్సెప్ట్ అక్కడ కూడా వర్కౌట్ అయ్యింది. బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో సందీప్ మళ్ళీ ఆ దర్శకుడిని కలిసినట్లుగా టాక్ వచ్చింది. కానీ అప్పుడు కూడా వర్కౌట్ కాలేదట.
బాలీవుడ్ హీరోను పట్టేసిన సందీప్
ఇక ఫైనల్ గా సందీప్ మరో బాలీవుడ్ అఫర్ ను పట్టేశాడు. రణ్ బీర్ కపూర్ తో సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ ఆ విషయాన్నీ కన్ఫమ్ చేసేశాడు. నెక్స్ట్ బ్రహ్మాస్త్ర సినిమా ఆ తరువాత కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ తో సినిమా చేయనున్నట్లు చెప్పాడు.
Recommended Video
ఆ సినిమా హిట్టయితే..
మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏమిటంటే.. సందీప్, మహేష్ బాబుకు చెప్పిన యాక్షన్ డ్రామా కథనే రణ్ బీర్ కపూర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కొద్దీ పాటి మార్పుల గురించి తప్పితే ఆ హీరో పెద్దగా డౌట్స్ ఏమి పెట్టుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకవేళ ఆ సినిమా హిట్టయితే గనక సందీప్ బాలీవూడ్ లోనే మరో బిగ్ బిగ్ బడ్జెట్ సినిమా తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.