సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు.. మహేష్ బాబుతో అనుకుంటే!
తెలుగు చిత్రసీమలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' రూపంలో చిన్న సినిమాను తెరకెక్కించి భారీ రెస్పాన్స్ కూడగట్టుకున్నారు. హీరోని మాస్ లుక్ లో చూపించడంలో తనను మించిన డైరెక్టర్ లేదని రుజువు చేసుకున్నారు. దీంతో తొలి సినిమాతోనే సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొంది మంచి పాపులారిటీ సంపాదించారు సందీప్.
ఒక్క సినిమాతోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు అడుగులేసింది సందీప్ రెడ్డి వంగా.. అక్కడ కూడా సూపర్ క్రేజ్ సంపాదించారు. తన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ప్రేక్షక లోకం చూపు తన వైపు తిప్పుకున్నారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో బీ టౌన్ లో సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది.

ఈ నేపథ్యంలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ నిర్మాతలు సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపారు. ఆయన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉండనుందని వార్తలు విన్నాం. కానీ ఆ వార్తలు రూమర్స్ అని నిరూపిస్తూ తన తదుపరి సినిమా బాలీవుడ్ లోనే అని పేర్కొన్నాడు సందీప్ రెడ్డి.
హిందీలో 'కబీర్ సింగ్' సినిమాను నిర్మించిన టీ సిరీస్ భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మాతలుగా తన కొత్త ప్రాజెక్ట్ ఉండనుందని తెలిపారు సందీప్ రెడ్డి వంగా. ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కాగా ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. నెగెటివ్ రోల్ లో ఉండే రణ్‌బీర్ పాత్రను బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా సందీప్ రెడ్డి డిజైన్ చేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











