twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ అంటే తెలుసా? క్రిటిక్‌కు సినిమా అంటే తెలుసా.. బాలీవుడ్‌ను కడిగిపారేసిన సందీప్ రెడ్డి వంగా

    |

    అర్జున్ రెడ్డి రీమేక్‌గా రూపొందిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దుమారం రేపుతున్నది. ఈ సినిమా సినీ విమర్శకులు పెదవి విరిచినప్పటికీ బాలీవుడ్‌లో ప్రేక్షకులకు నుంచి మంచి రెస్సాన్స్ వస్తున్నది. అయితే ఇటీవల సందీప్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అత్యంత వివాదాస్పదంగా మారింది. సినీ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బాలీవుడ్ సినీ క్రిటిక్స్‌పై సందీప్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

    బూతు సినిమానా?

    బూతు సినిమానా?

    కబీర్ సింగ్ సినిమాను బూతు సినిమాగా వర్ణించిన క్రిటిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు చూసి ప్రభావం చెందుతారని వ్యాఖ్యలు చేస్తున్న క్రిటిక్స్, సామాజిక కార్యకర్తల తీరును సందీప్ తప్పుపట్టారు. బాలీవుడ్‌లో ప్రముఖ క్రిటిక్‌గా పేరున్న రాజీవ్ మన్సాందానీపై సెటైర్లు వేశాడు. ఆయనకు సినిమా గురించి ఏమీ తెలియదు. కేవలం ఏదో అంశాన్ని పట్టుకొని సినిమా బాగాలేదని చెప్పడం దారుణం. సినిమాలో డైలాగ్స్, సినిమాటోగ్రఫి, సౌండ్ లాంటి విభాగాల గురించి చెప్పలేకపోయారు అని అన్నారు.

     ప్రముఖ క్రిటిక్‌పై మండిపాటు

    ప్రముఖ క్రిటిక్‌పై మండిపాటు

    లావుగా ఉండే క్రిటిక్ రాజీవ్‌పై కూడా కామెంట్లు చేశారు. ఆయన లావుగా ఉంటారని చెడుగా మాట్లాడితే తప్పే.. ఆయనలో ఉండే ఇతర పాజిటివ్ అంశాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి అని సందీప్ చురకలు అంటించారు. ఇక కబీర్ సింగ్ రేప్ కల్చర్‌ను పెంచుతుందని సెన్సార్ బోర్డు అధికారి చేసిన వ్యాఖ్యలపై సందీప్ ఫైర్ అయ్యాడు. ఆమెకు అసలు రేప్ అంటే తెలుసా? రేప్ స్పెల్లింగ్ కూడా తెలియదు. నేను డాక్టర్‌గా పనిచేసినప్పుడు రేప్ బాధితులకు చికిత్స చేశాను. వారి బాధేంటో నాకు బాగా తెలుసు అని అన్నారు.

     ఆ సినిమాలు చూసి మాఫియాగా మారారా?

    ఆ సినిమాలు చూసి మాఫియాగా మారారా?

    సినిమాలు చూసి ప్రేక్షకులు చెడిపోతారంటే.. హిందీలో పరిందా, ఖల్ నాయక్, రామ్ లఖన్, సంజూ లాంటి సినిమాలు వచ్చాయి. అంత మాత్రాన ప్రేక్షకులు మాఫియాగా మారారా? లేక బందిపోట్లుగా మారారా? అని ప్రశ్నించారు. కబీర్ సింగ్‌లో చెంపపై కొట్టుకోవడం తప్పేమీ లేదున్నారు. ఎవరినైనా బాగా ఇష్టపడితే, వారి మధ్య ప్రేమ ఉంటే అలాంటి సంఘటనలు సహజం అని సందీప్ అన్నారు.

     క్రిటిక్స్‌కు సినిమా గురించి తెలియదు

    క్రిటిక్స్‌కు సినిమా గురించి తెలియదు

    ప్రేమికులు ఒకరినొకరు కొట్టుకోవడం ఇద్దరి మధ్య స్వేచ్ఛకు చిహ్నం. హీరో, హీరోయిన్లు కొట్టుకోవడంలో ఎలాంటి తప్పు కనిపించలేదు. పురుషాధిక్యత గురించి మాట్లాడుతున్న క్రిటిక్స్ ఎన్నడూ ప్రేమలో పడి ఉండకుండా వచ్చు అని సందీప్ ఘాటైన విమర్శలు చేశారు. బాలీవుడ్ క్రిటిక్స్ ఏమీ తెలియదు. ఈ విషయంలో టాలీవుడ్ క్రిటిక్స్ గొప్ప. కనీసం సినిమాలోని అంశాల గురించి వారికి తెలుసు అని సందీప్ అన్నారు.

    English summary
    Vijay Deverakonda's Arjun Reddy was a massive hit at the box office back in 2017, and its Hindi remake, Kabir Singh, is treading the same path. Reports suggest that Kabir Singh mints nearly Rs. 250 crores. In this occassion, Sandeep Reddy criticises Bollywood critics heavily.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X