Padma Awards 2022 జూనియర్ ఆర్టిస్ట్‌కు ఇచ్చుకొండి.. పరువు తీయకండి.. పద్మశ్రీని తిరస్కరించిన లెజెండరీ సింగర్
దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చాటుకొన్న కళాకారులు, సామాజిక సేవలకు, ఇతర ప్రముఖులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరం కోసం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. అయితే బెంగాల్‌కు చెందిన మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జి గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ హేమంత ముఖోపాధ్యయ్,, గాయని సంధ్యా ముఖోపాధ్యయ అవార్డులను తిరస్కరించడం వివాదంగా మారింది. సంధ్య ముఖోపాధ్యయ కూతురు ఓ ప్రకటనలో ఘాటుగా విమర్శలు చేయడం మరింత వివాదంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దిగ్గజ సంగీత దర్శకులతో ఎవర్ గ్రీన్ పాటలు
బెంగాల్ సంగీత ప్రపంచంలో సంధ్యా ముఖోపాధ్యాయ్‌ను లెజెండరీగా సింగర్‌గా అభివర్ణిస్తారు. ప్రముఖ గాయకుడు హేమంత ముఖర్జీతో కలిసి ఎవర్ గ్రీన్ సాంగ్స్ పాడారు. సంధ్యా కేవలం బెంగాలీ సంగీతానికే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లో సంగీత దిగ్గజాలు ఎస్టీ బర్మన్, అనిల్ బిస్వాస్, మదన్ మోహన్, రోషన్, సలీల్ చౌదరీతో కలిసి ఎన్నో పాటలు పాడి సంగీత అభిమానులను ఆకట్టుకొన్నారు.

8 దశాబ్దాలపాటు సంగీత ప్రపంచంతో
గాయని సంధ్యా ముఖర్జీ ఎన్నో అవార్డులను, సత్కారాలను అందుకొన్నారు. 1970లో జయ్ జయంతి, నిషి పద్మ లాంటి చిత్రాల్లో అద్భుతంగా పాడినందుకు గాను జాతీయ చలన చిత్ర ఉత్తమ మహిళా గాయనిగా అవార్డు అందుకొన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 90 సంవత్సరాలు. దాదాపు భారతీయ సంగీత ప్రపంచానికి 8 దశాబ్దాలపాటు తన సేవలు అందించారు.

పద్మ శ్రీ జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి
తన తల్లి సంధ్యా ముఖోపాధ్యాయ్‌కి పద్మ శ్రీ అవార్డు ప్రకటించడంపై కూతురు సౌయీ సేన్‌గుప్తా ఘాటుగా స్పందించారు. పద్మ శ్రీ అవార్డు ప్రకటిస్తున్నట్టు ఢిల్లీ నుంచి ఉన్నతాధికారి సమాచారం అందించగా.. తనకు స్వీకరించడం ఇష్టం లేదు అని తన తల్లి చెప్పారు. ఎనిమిది దశాబ్దాలు కెరీర్ ఉన్న గాయనికి పద్మ శ్రీ అవార్డు ఇవ్వడం ఆమె ప్రతిష్టను, హోదాను కించపరచడమే సౌయి సేన్ గుప్తా అని అన్నారు.

దిగ్గజ గాయనికి పద్మ శ్రీ అవార్డు ఇస్తారా?
తన తల్లి, గాయని సంధ్యాకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వడం సమంజసం కాదు. పద్మ శ్రీ జూనియర్ ఆర్టిస్టుల స్థాయి. గీతాశ్రీ లాంటి సంధ్యా ముఖోపాధ్యాయ్‌కి ఆ అవార్డు సరితూగదు. ఆమె గానమాధ్యుర్యానికి ప్రజలు ఎప్పుడో వెలకట్టలేని అవార్డులను, పురస్కారాలను ఇచ్చారు అని కూతురు సౌమ్య సేన్ గుప్తా ఘాటుగా స్పందించారు.
Recommended Video

భారత రత్న, దాదా సాహెబ్ స్థాయి అవార్డు
గాయని సంధ్యా ముఖోపాధ్యాయ్‌కి పద్మ శ్రీ అవార్డు ఇవ్వడంపై నెటిజన్లు, అభిమానులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. 90 ఏళ్ల వయసులో పద్మ శ్రీ అవార్డు ఇస్తారా? ఆమెకు భారత రత్న లేదా దాదా సాహెబ్ ఫాల్కే లాంటి అవార్డులు ఇచ్చి గౌరవించుకోవాల్సిన పరిస్థితి. దేశ గర్వించ దగిన గాయకుల్లో ఆమె ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











