60ల్లోనూ వెన్నెతగ్గని సంగీతా అందం... సెలూన్ లో పుట్టినరోజు వేడుకలు
20ల్లో ఉన్నప్పుడు లేలేత సొగసులతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అందాల తార సంగీతా బిజిలానీ, అరవయ్యోవ పడిలోకి అడుగుపెట్టినా అదే అందంతో కట్టిపాడేస్తోంది. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ భామపై టాప్ హీరోలు సైతం మనసు పారేసుకున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇటీవలే 60వసంతాలు పూర్తిచేసుకున్న ఈ భామ, చెక్కు చెదరని శరీర సౌష్ఠవంతో అదే ఊపుతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.
పుట్టినరోజు నాడు తన శిరోజాల సంరక్షణ కోసం ఓ సెలూన్ కు వెళ్లిన సంగీత అక్కేడే, స్టాఫ్ ఇచ్చిన ట్రీట్ లో పాలుపంచుకుంది. వారు అభిమానంతో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో పాలుపంచుకుంది. అయితే ఈ వేడుకల్లో సెలూన్ స్టాప్ మొత్తం పీపీఈ సూట్లు ధరించి, భౌతిక దూరాన్ని కూడా పాటించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

మాంచి ఫామ్ లో ఉండగానే క్రికెటర్ అజారుద్దీన్ ను పెళ్లాడి సినిమాలకు టాటా చెప్పేసిన సంగీత ఆ తరువాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, ఇప్పటికీ ఆమె అందం చెక్కుచెదరలేదనే చెప్పాలి.
యోగాసాధనతో ఇప్పటికీ అదే ఫిగర్ ను మెయిన్ టెయిన్ చేస్తున్న సంగీతకు ఆఫర్లు కూడా అదే రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి. కానీ, వచ్చిన ఆఫర్లేమి పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో, ఆమె వాటిని తిరస్కరించిందట. ఏమైనా ఇప్పిటికీ అమ్మడు సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటే చూడాలని చాలా మందే కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











