బాలీవుడ్ హీరోతో సానియా డేటింగ్.. బయటపెట్టిన కరణ్ జోహర్

బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ లైఫ్ ఎప్పుడూ కలర్‌ఫుల్‌గానే ఉంటుంది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్‌లో రొమాంటిక్, లవ్ రిలేషన్స్‌ను క్రేజీగానే మెయింటెన్ చేశాడు. షాహిద్ లైఫ్‌లోకి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ లాంటి వాళ్లు వచ్చి పోయారు. అయితే కొద్ది మందికి మాత్రమే తెలిసిందేమిటంటే.. కరీనాతో విడిపోయిన తర్వాత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో డేటింగ్ చేశారనే విషయం మీడియాలో పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఆ విషయాన్ని కరణ్ జోహర్ మీడియాలో బహిర్గతం చేశారు.. వివరాల్లోకి వెళితే..

పీకల్లోతు ప్రేమలో షాహిద్

పీకల్లోతు ప్రేమలో షాహిద్

పీకల్లోతు ప్రేమలో ఉన్న షాహిద్, కరీనా కపూర్‌కు జబ్ వీ మెట్ సినిమా షూటింగ్‌లో విభేదాలు తలెత్తాయి. దాంతో వారిద్దరూ విడిపోవడం, ఆ తర్వాత వెంటనే సైఫ్‌తో కరీనా రిలేషన్ పెట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కొద్దికాలం షాహిద్, సానియా మిర్జా మధ్య రొమాంటిక్ రిలేషన్ కొంతకాలం జరిగిన విషయం ఎవరికి తెలియకుండానే జరిగిపోయింది.

షాహిద్ డేటింగ్ నిజమేనా?

షాహిద్ డేటింగ్ నిజమేనా?

ఇటీవల ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తన షోలో సానియాతో షాహిద్ ప్రేమ గురించి ప్రస్తావించినప్పుడు మాట్లాడటానికి కొంత నిరాసక్తతను చూపించారు. మీరిద్దరూ డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చాయి. అవి నిజమేనా అంటూ కరణ్ అడిగినప్పుడు ముక్తసరిగా జవాబిచ్చింది.

నాకు గుర్తు లేదని సానియా మిర్జా

నాకు గుర్తు లేదని సానియా మిర్జా

షాహిద్‌తో డేటింగ్ విషయం నాకు సరిగా గుర్తుంచుకోలేదు. అది చాలా కాలం క్రితం జరిగిన విషయం. నా జీవితంలో చాలా దూరం ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆ విషయం నాకే గుర్తుకు రావడం లేదు అంటూ షాహిద్‌తో ప్రేమ వ్యవహారాన్ని చెప్పకుండా సానియా దాటవేసేందుకు ప్రయత్నించారు.

Recommended Video

Sania Mirza and Veena Malik's Nasty Twitter Spat After Pak Loss
సానియా మిర్జా పెళ్లి అలా..

సానియా మిర్జా పెళ్లి అలా..

అయితే షాహిద్, సానియా డేటింగ్ వ్యవహారం మీడియా గుర్తించనంతగా చాలా స్వల్పకాలం జరిగిపోయిందనేది కొందరికి మాత్రమే తెలిసిన విషయం. ఆ తర్వాత సానియా మిర్జా క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో పెళ్లి చేసుకోవడం, సైఫ్‌ను కరీనా పెళ్లి చేసుకోవడంతో షాహిద్ ప్రేమ వ్యవహారాలకు అలా అర్ధాంతరంగా బ్రేకులు పడ్డాయి. తాజాగా కరణ్ జోహర్ కారణంగా మరోసారి మీడియాలో వెలుగు చూశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X