హీరో వలన షూటింగ్‌కు వెళ్లడం మానేసిన హీరోయిన్.. పచ్చి అబద్దం!

ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ వేదికగా జరుగుతున్న మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. మీటూ ఉద్యమానికి భారీ ఎత్తున సినీ ప్రముఖుల నుంచి మద్దత్తు లభిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఈ ఉద్యమంలో నిజాయతీ లేదని, స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు చేసేవారు సైతం ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు అలాంటి సంఘటనే ఎదురైంది.

హాలీవుడ్ మూవీ రీమేక్

హాలీవుడ్ మూవీ రీమేక్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజన సంఘీ ప్రస్తుతం కీజీ ఔర్ మాని చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌ అనే హాలీవుడ్ మూవీకి ఈ చిత్రం రీమేక్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా సుశాంత్ సింగ్ హీరోయిన్ సంజన సంఘీని లైంగికంగా వేధించినట్లు వార్తలు వచ్చాయి.

షూటింగ్ కుడా మానేసింది

షూటింగ్ కుడా మానేసింది

సుశాంత్ వేధింపులు భరించలేక సంజన సంఘీ సెట్స్ కి రావడం కూడా మానేసిందనే ఆరోపణలు వినిపించాయి. దీనితో సుశాంత్ పై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ మొదలైంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆరోపణలతో సుశాంత్ సమాధానం ఇచ్చాడు.

సంజనతో చాటింగ్

సంజనతో చాటింగ్

ఆరోపణలకు సుశాంత్ గట్టిగా సమాధానం ఇచ్చాడు. సంజనతో జరిగిపిన చాట్ వివరాలని బయట పెట్టాడు. ప్రైవేట్ విషయాల్ని బయట పెట్టడం మంచిది కాదు. కానీ తప్పడం లేదు అంటూ సుశాంత్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సంజనతో సరదాగా చాట్ చేస్తున్నట్లు అందులో ఉంది.

పచ్చి అబద్దం

నన్నెవరో వేధించారని వార్తలు వస్తున్నాయి. నేను నిన్ననే యూఎస్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చి ఈ విషయం తెలుసుకున్నా. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. నన్నెవరూ వేధించలేదు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ సంజన సంఘీ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X