గుడ్‌బై ఇక జీవితంలో ముఖం చూడను.. సుశాంత్ హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో దాదాపు 28 మందిని ఇప్పటికే ప్రశ్నించడం తెలిసిందే. మంగళవారం రోజున దిల్ బేచారా హీరోయిన్‌ను సుమారు 10 గంటలపాటు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అంత సుదీర్ఘంగా చర్చించడం మీడియాలో రకరకాల అనుమానాలకు దారి తీసింది. అయితే అలాంటి అనుమానాల మధ్య దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా పోస్టు పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది.

సుశాంత్‌పై మీటూ ఆరోపణలపై క్లారిటీ

సుశాంత్‌పై మీటూ ఆరోపణలపై క్లారిటీ

బాలీవుడ్‌లో గతేడాది మీటూ ఉద్యమం జరిగిన సమయంలో సుశాంత్‌పై సంజన సంఘీ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్టు వార్తలు రావడం సంచలనం రేపాయి. అయితే ఆ సమయంలో సంజన అమెరికాలో ఉండటంతో ఈ ఆరోపణలపై కాస్త ఆలస్యంగా స్పందించారు. ఆ సమయంలో తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్పందిస్తూ.. యూఎస్ నుంచి వస్తున్నాను. సుశాంత్‌పై నేను చేసినట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

సుదీర్ఘ విచారణ తర్వాత మనస్తాపం

సుదీర్ఘ విచారణ తర్వాత మనస్తాపం

ముంబై పోలీసులు మంగళవారం దిల్ బేచారా హీరోయిన్‌ సంజనా సంఘీని సుదీర్ఘంగా విచారించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తున్నది. గతంలో మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో సుశాంత్‌పై ఆరోపణలు సంజన చేయడం మీడియాలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో సంజన సంఘీని మీటూ ఆరోపణలను ప్రశ్నించినట్టు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు బెంబేలెత్తిన సంజన తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నది.

ముంబై ఎయిర్‌పోర్టు నుంచి

ముంబై ఎయిర్‌పోర్టు నుంచి

బాంద్రా పోలీసుల విచారణ అనంతరం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తూ ఎయిర్‌పోర్టు నుంచి తన ఇన్స్‌టాగ్రామ్‌లో సెన్సేషనల్ పోస్టు పెట్టారు. ఇక ఎన్నడూ ముంబైకి తిరిగి రాకపోవచ్చు అంటూ సంచలన కామెంట్‌ను పోస్టు చేశారు. ముంబై గుడ్‌బై. నాలుగు నెలల తర్వాత ముంబైకి వచ్చాను. మళ్లీ ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. మీ దారులు, వ్యవహారం వేరేలా కనిపిస్తున్నది అని అంటూ పోస్టులో పేర్కొన్నారు.

నేను మీలానే బాధలో ఉన్నాను

నేను మీలానే బాధలో ఉన్నాను

ప్రస్తుతం నేను చాలా బాధలో ఉన్నాను. దు:ఖంలో నా కళ్ల వెంట ధారాళంగా కన్నీరు జారుతున్నది. మీ గుండెలో కూడా కొంత బాధ ఉండి ఉంటుందని అనుకొంటున్నాను. వీలైతే మళ్లీ కలుద్దాం. కలవకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సంజన సంఘీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టడం సినీ, సోషల్ మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
దిల్ బేచారాలో సుశాంత్‌తో

దిల్ బేచారాలో సుశాంత్‌తో

ఇక సంజన సంఘీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కలిసి నటించిన దిల్ బేచారా చిత్రం విడుదలకు సిద్దమైంది. సుశాంత్ సింగ్ సూసైడ్ అనంతరం రిలీజ్ చేస్తున్న చివరి సినిమాగా దిల్ బేచారా మారబోతున్నది. ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్ జూలై 24 తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని నిర్మాత, దర్శకులు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X