twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్ : దూరంగా ఉండమని కోరుతున్న దాదా

    |

    ప్రతీ ఒక్కరూ కరోనాకు గజగజ వణికిపోతున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేద్దామని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. రోజు రోజుకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియాలో ఇప్పటికే దాదాపు 170మందికి ఈ కరోనా సోకగా.. ముగ్గురు మృతి చెందారు. మన రాష్ట్రంలో ఏడుగురికి ఈ వైరస్ సోకింది.

    కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా ధాటిని ఎదుర్కొనేందుకు కఠిన చర్యలను తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్స్, విద్యాసంస్థలు, మాల్స్, పబ్స్ వంటి వాటిని మూసి వేశారు. ఇంతలా విజృంభిస్తున్న కరోనాపై అవగాహన కలిగించేందుకు సినీ లోకం నడుం బిగించింది. తారలు కదిలి వచ్చి కరోనా సోకకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

    Sanjay Dutt About Coronavirus

    ఈ క్రమంలోనే బాలీవుడ్ పెద్దన్న, దాదా సంజయ్ దత్.. సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'ఇలాంటి సమయంలో సమాజానికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి మీ గురించి, మీకు సంబంధించిన వారి గురించి జాగ్రత్త వహించండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనంరం కలిసి త్వరలో దీనిని అధిగమిస్తాము. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండ'ని ట్వీట్ చేశాడు.

    English summary
    Sanjay Dutt About Coronavirus. I urge everyone to understand the importance of social distancing during this time. Please take care of yourself and your loved ones. We are in this together & will overcome this soon if we take proper precautions. Stay home to stay safe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X