తన ఆరోగ్యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సంజయ్ దత్.. అసలు ఏం జరిగిందంటే!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గత రాత్రి కొంత అనారోగ్యంతో హాస్పిటల్ చేరారు. మొదట్లో కరోనా వైరస్ వచ్చిందేమో అనుకోని సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే కోవిడ్ 19 పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని ముందుగానే వైద్యులు వివరణ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా ఈ సీనియర్ నటుడు తన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
సంజయ్ దత్ శనివారం సాయత్రం నుంచి కొంత అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడంతో బంధువులు ఆయనను ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఇక కరోనా సోకిందేమో అనుకోని ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ సంజయ్ దత్‌కు నెగెటివ్ వచ్చింది.

ఆందోళన పడాల్సిన అవసరం లేదని
రూమర్స్ డొస్ ఎక్కువ కాకముందే సంజయ్ దత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి డాక్టర్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇక సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్యంపై మరింత క్లారిటీ ఇచ్చారు. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం బాగానే ఉన్నానని అన్నారు. ఇక రెండు రోజుల్లో ఇంటికి కూడా చేరుకుంటానని అన్నారు.

కోవిడ్ 19 పరీక్షల్లో నెగిటివ్
కోవిడ్ 19 పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని చెప్పిన సంజయ్ దత్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు సంరక్షణలో ఉన్నానని అన్నారు. ఇక తాను త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా సంజయ్ వివరణ ఇచ్చారు.
Recommended Video

పలు డిఫరెంట్ సినిమాలతో
ఇటీవల సంజయ్ దత్ తన 61వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ హీరో పలు డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. మహేష్ భట్ దర్శకత్వంలో సడఖ్ 2 సినిమాతో పాటు మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇక KGF 2 లో అధీరా అనే పాత్రలో మెయిన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











