twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పురుగులు ఏరుకొని అన్నం తిన్నా.. అందుకే మా పిల్లలను.. జైల్లో దుర్భర జీవితంపై సంజూ

    |

    బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ జీవితం అనేక వివాదాలతో కొనసాగడం, జైలు జీవితం లాంటి అంశాలు గతంలో సంచలనం రేపాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు భాగంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. సెలబ్రిటీ అయినప్పటికీ అధికారులు తనను సాధారణ ఖైదీ మాదిరిగానే ట్రీట్ చేశారన పలు సందర్భాల్లో తెలిపారు. జైలు జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. ఆయన చెప్పిన భయంకరమైన విషయాలు ఏమిటంటే.

    జైలు జీవితానికి సంబంధించి

    జైలు జీవితానికి సంబంధించి

    నేను జైలు జీవితం అనుభవించే సమయంలో పిల్లలను పూర్తిగా దూరంపెట్టాను. వారి దృష్టిలో ఇమేజ్ వేరు. జైలులో చిరిగిన బట్టలతో ఉండటాన్ని వారు చూడటం ఇష్టం లేదు. అందుకే వారిని చాలా రోజులు దూరం పెట్టాను. జైలులో ఉన్నంత కాలం నేను వారు నాకు దూరంగానే పెరిగారు. పెరోల్‌పై వచ్చిన సమయంలోనే నేను వారికి కనిపించే వాడిని అని సంజయ్ దత్ చెప్పారు.

    పిల్లలు మారాం చేసేవాళ్లు

    పిల్లలు మారాం చేసేవాళ్లు

    అయితే జైలులో ఉన్న సమయంలో నాతో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించేవారు. తల్లితో గొడవ పడి ఫోన్‌లో మాట్లాడాలని చూసేవారు. అయితే నేను ఎక్కడో కొండలు, గుట్టల మధ్య షూటింగ్ చేస్తున్నానని, అక్కడ మొబైల్ కనెక్టివిటీ లేదని అబద్ధం చెప్పి వారికి నచ్చచెప్పేది. ఇప్పటికి అలానే వారికి తెలుసు. వారి దృష్టిలో నా ఇమేజ్ మరోలా ఉండోద్దనేది నా ఉద్దేశం అని సంజయ్ అన్నారు.

    పురుగుల పడిన పప్పుతో భోజనం

    పురుగుల పడిన పప్పుతో భోజనం

    మహారాజుల బతికిన నాకు జైలు జీవితం చాలా నేర్పింది. జైలులో ఉన్నప్పుడు ఈగలు పడిన పప్పుచారు ఇచ్చేవారు. కీటకాలను తీసివేసి పప్పుచారును తాగే వాడిని. పూణే జైలులో ఈగలు, ఇతర కీటకాలు లెక్కలేని విధంగా ఉండేవి. కొన్నిసార్లు తలలో దూరేవి. మరినకొన్నిసార్లు బట్టల్లోకి, అలా ఆహారంలో కూడా పడేవి. ఆహరంలో పడిన పురుగులను ఏరి పక్కన పెట్టి ఆహారం తిన్న రోజులు ఉన్నాయి అని సంజయ్ దత్ తెలిపారు.

    పురుగుల భోజనం ఎలా తిన్నావంటే..

    పురుగుల భోజనం ఎలా తిన్నావంటే..

    నా తోటి ఖైదీ పురుగులు పడిన పప్పు, అన్నం ఎలా తింటావని ప్రశ్నిస్తే.. ఇక్కడ మనకు ప్రొటీన్స్ దొరకవు. పప్పన్నంలోనే ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి పురుగులను బయటకు తీసి అన్నం తింటాను. పప్పుచారు తాగుతాను. ఇలా తినకుండా ఆకలితో ఎన్నాళ్లు చస్తావు అని నా తోటి ఖైదీని అడిగానని సంజయ్ చెప్పారు.

    Recommended Video

    O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent
    దారుణమైన జీవితం చూసిన తర్వాత

    దారుణమైన జీవితం చూసిన తర్వాత

    జైలులో దారుణమైన పరిస్థితులను చూసిన తర్వాత ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంటుంది. నా భార్య మాన్యతాదత్ పప్పు బాగా వండకపోయినా.. మాడ గొట్టినా గానీ నేను పెద్దగా పట్టించుకొను. జైలులో భోజనం గుర్తుస్తే.. ఇక్కడ ఎలాంటి భోజనమైన తినవచ్చు. జీవితంలో చాలా విషయాలను జైలులోనే తెలుసుకొన్నాను అని సంజయ్ వెల్లడించారు.

    English summary
    Bollywood Actor Sanjay Dutt revealed about diffuculties in Pune Jail life, and Worst food served. Sanjay said, He had Dal Rice with Flies many times
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X