twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేశ్యలతో కాకుండా 308 మందితో.. నేను టెర్రరిస్టును కాదు.. సంజూ ట్రైలరే బ్లాక్‌బస్టర్ రేంజ్

    By Rajababu
    |

    Recommended Video

    వేశ్యలతో కాకుండా 308 మందితో.. నేను టెర్రరిస్టును కాదు.. సంజూ ట్రైలరే బ్లాక్‌బస్టర్ రేంజ్

    ఎన్నో రోజులుగా సినీ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బయోపిక్ సంజూ చిత్రం ట్రైలర్ రిలీజైంది. రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూసిన ప్రతీ ఒక్కరు మైండ్ బ్లోయింగ్ అని అంటున్నారు. సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజూగా రణబీర్ హావభావాలు అద్భుతంగా కనిపించాయి.

    ఎర్రవాడ జైలు నుంచి సంజూ

    ఎర్రవాడ జైలు నుంచి సంజూ

    లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ సంజూ పాత్రధారి రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యానంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన ఆత్మకథను ప్రజల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు. అలాగే ఎర్రవాడ జైలు నుంచి సంజయ్ దత్ నడిచివచ్చే సీన్లు ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకొంటుంది.

     నేను టెర్రిరిస్టును కాను

    నేను టెర్రిరిస్టును కాను

    నేను వెధవను కావొచ్చు. డ్రగ్ అడిక్ట్ కావొచ్చు. మూర్ణుడిని కావొచ్చు. ఇవన్నీ నేనే అంటే ఒప్పుకొంటా. కానీ నేను టెర్రరిస్టును కాదు అని అంటారు. ఏకే 56 గన్ దగ్గరపెట్టుకోవడం, అండర్ వరల్డ్ కనెక్షన్స్, జీవితంలో ఫ్రెండ్‌షిప్, వైవాహిక జీవితం లాంటి భావోద్వేగ సన్నివేశాలను ట్రైలర్‌లో అందించారు. తండ్రితో విభేదించి తొలిసారి డ్రగ్స్ తీసుకొన్నాను. రెండోసారి అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు, మూడోసారి దానంతటా అదే అలవాటైంది.

    350 మందితో పడుకొన్నానని

    350 మందితో పడుకొన్నానని

    భార్యతో కాకుండా ఎంతమంది సెక్స్‌ను అనుభవించావని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సంజూ సమాధానమిస్తూ.. వేశ్యలతో కలిపా లేక కలపకుండానా? అని ఎదురు ప్రశ్నవేసి.. 308 మాత్రం గుర్తున్నాయి. సుమారు 350 మందితో పడుకొన్నాను అని రాసుకో అంటాడు.

    పీకే దర్శక, నిర్మాతల నుంచి

    పీకే దర్శక, నిర్మాతల నుంచి

    సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ పరకాయ ప్రవేశం చేశాడనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని పీకే, 3 ఇడియెట్స్, లగే రహో మున్నాభాయ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను రూపొందించిన నిర్మాత విధూ వినోద్ చోప్రా, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి సంజూ చిత్రాన్ని తెరకెక్కించారు.

     ఊహకు అందని సన్నివేశాలు

    ఊహకు అందని సన్నివేశాలు

    సంజూ చిత్ర ట్రైలర్‌లోని కొన్ని సీన్లు చూస్తే మాటలు రాకుండా ఉంటాయి. నా కొడుకు జీవితం గడిచిపోయిన కాలం లాంటిది. అది మళ్లీ తిరిగివస్తుంది అని నేను అనుకోవడం లేదు అనే మాటలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. మంగళసూత్రం లాంటి సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.

    ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్

    ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్

    సంజూ చిత్రంలో డైలాగ్స్ వింటే మైండ్ బ్లోయింగ్. జైలులో సంజూ ఉన్నప్పుడు టాయిలెట్ నీళ్లు గదిలోకి వరదలా వచ్చే సీన్ ఉద్వేగానికి గురిచేస్తుంది. ఇలా కొన్ని సీన్లు చూస్తేనే బ్లాక్ బస్టర్ సినిమా చూసినంత అనుభూతి కలిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    Finally, The wait is over and the much anticipated Sanju trailer is out. The makers of Sanju unveiled its trailer on Wednesday in the presence of the film's cast and crew. The trailer of the Sanjay Dutt biopic that stars Ranbir Kapoor as the protagonist, has not just met with the expectations of the fans, but surpassed them at several levels. We just have one word for the Sanju trailer and that is Mind Blowing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X