చనిపోతూ స్టార్ హీరోకు 72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని.. ఆ హీరో ఎవరో తెలుసా?

సినిమా నటులకు అబిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ముఖ్యంగా స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత స్పెషల్. అలాంటి స్టార్ కు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వారు తమ అభిమాన నటుల కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. అలాంటి ఓ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు చనిపోయే ముందు ఏకంగా రూ. 72 కోట్లు విలువ చేసే ఆస్తిని తన అభిమాన హీరోకు రాసి ఇచ్చేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ రాసి ఇచ్చిన ఆ అభిమాని ఎవరు? అన్నికోట్ల ఆస్తిని ఆ హీరో తీసుకున్నారు? పూర్తి వివరాలకు వెళ్తే..

ఆ అభిమాన హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో సంజయ్ దత్.. ముంబై కి చెందిన నిషా పాటిల్(62)కు హీరో సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం. ఆయన నటనా నైపుణ్యానికి ఆకర్షితురాలైన నిషా పాటిల్.. సంజయ్ దత్ కు డై హార్డ్ ఫ్యాన్ గా మారిపోయింది. ఆయన అంటే ఆమె పడి చచ్చిపోతుంది. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో సార్లు కలువాలని చూసిన ఆమె హీరో సంజయ్ దత్ ను కలవకపోయింది. అయినా ఆమె అనునిత్యం హీరో సంజయ్ దత్ ను దైవం లా ఆధారించేది. కొన్నేళ్ల క్రితం నిషా పాటిల్‌ అనారోగ్యం పాలైంది. అయితే తన మరణాన్ని ముందే గ్రహించిన నిషా 2018లో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

Sanjay Dutt die-hard fan Nisha Patil left him her entire fortune of 72 crore before passing away

ఈ వీరాభిమాని తన పేరిట ఉన్న రూ. 72 కోట్ల ఆస్తిని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కే చెందేలా ఓ వీలునామా రాసింది. అలాగే తన డబ్బు, నగలు, ఆస్తి అన్నింటిని సంజయ్ దత్‌ కి బదిలీ చేయాలని తన చివరి కోరికను వెల్లడించింది. ఈ మేరకు చనిపోయే ముందే బ్యాంకు అధికారులకు కూడా లెటర్స్ రాశారు. ఇక ఇటీవలె నిషా పాటిల్ అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో వీలునామా ప్రకారం.. ఆమె పేరిట ఉన్న ఆస్తి మొత్తం హీరో సంజయ్ దత్ కి బదిలి అయింది. దీంతో సంజయ్ దత్ షాక్ అయ్యారు.

ఈ క్రమంలో సంజయ్ దత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిషా పటేల్ అనే అభిమాని తనకు తెలియదని, ఆమె ఆస్తి తనకు వద్దని సంజయ్ దత్ రిజెక్ట్ చేశార. అభిమాని మించిన ఆస్తి వద్దని, అలాంటి అభిమానిని కలుసుకోనందుకు తాను చాలా బాధపడుతున్నానని సంజయ్ దత్ పేర్కొన్నారు. ఇక ఆమె రాసిచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని వారి కుటుంబ సభ్యులకే చెందేలా సంజయ్ ద‌త్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సంజయ్ దత్ నిర్ణయం పట్ల సినీ ప్రియులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sanjay Dutt die-hard fan Nisha Patil left him her entire fortune of 72 crore before passing away

ఇక సంజయ్ దత్ వర్క్ ఫ్రంట్ చూస్తే.. సంజయ్ దత్ బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. హీరో యష్ తో కలిసి'కేజీఎఫ్ 2'లో, దళపతి విజయ్ తో కలిసి'లియో'లో మెయిన్ రోల్ నటించారు. త్వరలో వెల్‌కమ్ 3 అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక సంజయ్ ఆస్తి వివరాలకు వస్తే.. సినిమాలతో పాటు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అతని నికర విలువ దాదాపు రూ.295 కోట్లు. అతను ఒక్కో సినిమాకు దాదాపు రూ. 8-15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు.సంజయ్ దత్ ఐపీఎల్ క్రికెట్ జట్లకు సహ యజమాని కూడా. దీనితో పాటు ఆయనకు దుబాయ్, ముంబైలలో ఆస్తులు, లగ్జరీ కార్లు, ఉన్నాయి.

More from Filmibeat

Read more about: sanjay dutt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X