twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంతకంటే గొప్ప బర్త్ డే గిఫ్ట్ ఉండకపోవచ్చు.. సంజయ్ దత్ ఎమోషనల్

    |

    ప్యాన్ ఇండియా చిత్రాల్లో బాహుబలి తరువాత కేజీయఫ్ చిత్రానికే ఎక్కువ మార్కులు పడతాయి. కన్నడ పరిశ్రమలో మొదలైన కేజీయఫ్ దక్షిణాదిని ఊపేయడమే కాకుండా.. ఉత్తరాదిన కలెక్షన్ల వర్షం కురిపించింది. కేజీయఫ్ దెబ్బకు ఖాన్లు సైతం బయపడ్డారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం డబ్బింగ్ చిత్రంతోనే బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలైంది. కేజీయఫ్ సాధించిన విజయాలు, విశేషాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజాగా సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా అధీరా లుక్‌ను విడుదల చేశారు.

    మొదటి పార్ట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో చాప్టర్ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో భారీ తారగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే సినిమాలో కీలకమైన క్రూరమైన అధీరా పాత్రకు బాలీవుడ్ దాదా, పెద్దన్న సంజయ్ దత్‌ను తీసుకున్నారు. ఆమధ్య అధీరాకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేయగా అది ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. తాజాగా అధీరాకు సంబంధించి పూర్తి లుక్‌ను విడుదల చేశారు.

     Sanjay Dutt Emotional On Adheera Look On His Birthday Gift

    నేడు సంజయ్ దత్ బర్త్ డే. ఈ సందర్భంగా చాప్టర్ 2 చిత్రయూనిట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మేరకు సంజు దాదా సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. ఈ మూవీ కోసం పని చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. నా బర్త్ డే సందర్భంగా ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇంకొకటి ఉండకపోవచ్చు.. ప్రశాంత్ నీల్, కార్తిక్, యశ్, దీపిక్, లితిక, ప్రదీప్, చిత్రయూనిట్ మొత్తానికి ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారి ప్రేమ, ఆదరణ, అభిమానాలే ఈ స్థాయిలో నిలబెట్టాయ'ని ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Sanjay Dutt Emotional On Adheera Look On His Birthday Gift. It's been a pleasure working on this film and I couldn't have asked for a better birthday gift. Thank you
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X