అమ్మా.. నీవు లేని జీవితం.. సంజయ్ దత్ ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి తన తల్లిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. అలనాటి బాలీవుడ్ నటి, దివంగత నర్గీస్‌దత్ సినీ హీరో సంజయ్‌దత్‌కు తల్లి అనే విషయం తెలిసిందే. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ నర్గీస్ 1981 మే 3వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి వర్దంతి రోజున సంజయ్ దత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు.
తన బాల్యంలో తనను ముద్దు చేస్తున్న తల్లి నర్గీస్ ఫోటోను సంజయ్ దత్ షేర్ చేసి భావోద్వేగానికి లోనయ్యారు. నిన్ను తలుచుకోకుండా ఒక్క రోజు కూడా నా జీవితం నుంచి గడిచిపోదు అంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. సంజయ్ దత్ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. అభిమానులు కుప్పలుతెప్పలుగా కామెంట్లు పెట్టారు.

సంజూబాబా చిన్నతనంలో నీ నవ్వు చాలా బాగుంది. నీ బాల్య స్మృతులు అద్భుతంగా ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంజయ్ దత్ పర్సనల్ విషయానికి వస్తే.. తండ్రి సునీల్ దత్, తల్లి నర్గీస్ గురించి ఎప్పడూ సోషల్ మీడియాలో తన అనుభూతులు పంచుకొంటారు. తన బాల్యం, యవ్వనంలోని ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతుంటారు.


Click it and Unblock the Notifications











