నా లైఫ్‌లో మళ్లీ జైలు జీవితం.. ఫ్యామిలీకి దూరమయ్యాను.. సంజయ్‌దత్ భావోద్వేగం

కరోనా లాక్‌డౌన్ సమయంలో సినీ తారలది ఒక్కొక్కరిది ఒక్కో కథ వినిపిస్తున్నది. కొందరు తమ కుటుంబానికి చేరువై ఆనంద క్షణాలను అనుభవిస్తుంటే.. మరికొందరు ఫ్యామిలీకి దూరమైన వ్యధభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితి బాలీవుడ్ యాక్టర్ సంజయ్ ‌దత్‌కు ఎదురైంది. తమ పిల్లలకు దూరమై ఓ రకమైన వేదనకు గురైనట్టు సంజయ్ దత్ మీడియాతో పంచుకొన్నారు. ఇంతకు సంజూ ఏ విధంగా తన కుటుంబానికి దూరమయ్యారంటే..

దుబాయ్‌లో చిక్కుకుపోయిన సంజయ్ దత్

దుబాయ్‌లో చిక్కుకుపోయిన సంజయ్ దత్

నా భార్య మాన్యత, నా ఇద్దరు పిల్లలు షారాన్, ఇక్రా కలిసి దుబాయ్‌కి వెళ్లారు. వారు అక్కడే ఉండగానే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. అయితే వారు దుబాయ్‌లో నేను ముంబైలో ఉండటంతో వారికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రతీ రోజు ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం, చూసుకోవడం జరుగుతున్నది. కానీ వారి సెఫ్టీ గురించే నాకు బెంగగా ఉంది అని సంజయ్ దత్ అన్నారు.

లాక్‌డౌన్‌ పిరియడ్‌లో సంజయ్

లాక్‌డౌన్‌ పిరియడ్‌లో సంజయ్

నా జీవితంలో అతి పెద్ద లాక్‌డౌన్ సమయం గడిచిపోయింది. అంతకంటే దారుణమైన లాక్‌డౌన్ నా జీవితంలో మరోటి ఉండదు. లాక్‌డౌన్‌ను గుర్తుంచుకొంటే అప్పుడు ఇప్పుడు నా ఫ్యామిలే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో వారికంటే నాకు ఎవరూ లేరు అని సంజయ్ దత్ అన్నారు. పూణే జైలులో శిక్షను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

వీడియో కాల్స్‌తో నేను

వీడియో కాల్స్‌తో నేను


లాక్‌డౌన్ సమయంలో టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల బాధ ఎక్కువగా లేదు. ప్రతీ రోజు చాలా సార్లు ఫోన్‌లో వీడియోకాల్స్‌ చేసుకుంటూ కలుసుకొంటున్నాం. అయినా ఈ సమయంలో నాతో లేరనే ఓ విషయం, బాధ వెంటాడుతున్నది. ఇలాంటి సమయాలే జీవితం, కుటుంబం విలువ తెలుస్తుంది అని సంజయ్ దత్ అన్నారు.

Recommended Video

O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent
భవిష్యత్ సినిమాలపై ప్లానింగ్

భవిష్యత్ సినిమాలపై ప్లానింగ్

లాక్ డౌన్ సమయంలో నా సినిమాల గురించి ప్లాన్ చేసుకొంటున్నాను. నిర్మాతలు, దర్శకులతో వీడియో ఛాట్ ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయి. కాగా, సంజయ్ దత్ చివరిసారిగా పానిపట్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X