ప్రభాస్‌ విలన్‌కు 10 కోట్లు రెమ్యూనరేషన్.. ఆ కటౌట్‌కు ఆమాత్రం ఇవ్వాల్సిందే!

టాలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళ్తోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో తన రేంజ్‌ను క్రమంగా పెంచుకునేందుకు వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా గత ఏడాది ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' మూవీ చేసి సక్సెస్ కొట్టాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అలా ఇప్పుడు అతడి చేతిలో ఉన్న చిత్రాల్లో 'ది రాజా సాబ్' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయని తెలిసిందే.

Sanjay Dutt Gets Huge Remuneration for Prabhas The Raja Saab Movie

ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' చిత్రం హర్రర్ కామెడీతో రాబోతుంది. ఈ సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

'ది రాజా సాబ్' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో ఎంతో మంది బడా స్టార్లు భాగం అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ కూడా నటిస్తున్నారు. ఆయన ఈ చిత్రంలో దెయ్యంగా కనిపిస్తారని అంటున్నారు.

Sanjay Dutt Gets Huge Remuneration for Prabhas The Raja Saab Movie

ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీలో సంజయ్ దత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ చిత్రం కోసం ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి గానూ నిర్మాతలు సంజయ్ దత్‌కు రూ. 10 కోట్లు ఇస్తున్నారట. వీటితో పాటు ఆయన సిబ్బందికి, ఇతర ఖర్చులు కలిపి మరో రూ. 2 కోట్లు ఇస్తున్నట్లు టాక్.

ఇదిలా ఉండగా.. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X