Pushpa The Rule: పుష్ప 2లో పాన్ ఇండియా హీరో.. ఈ ట్విస్టుకు మైండ్ బ్లాకే!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపకల్పనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూడో చిత్రమే 'పుష్ప: ద రైజ్'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు బన్నీని నేషనల్ స్టార్‌ను చేసేసింది.
మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'పుష్ప ద రూల్' మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తోన్నారు. దీంతో ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా మొదలెట్టింది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ పక్కా ప్లాన్‌తో శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా స్టార్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిసింది.

'పుష్ప ది రూల్' మూవీలో అత్యంత ముఖ్యమైన ఓ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ను తీసుకున్నారని తాజాగా తెలిసింది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్టులో ఆయన ఎంట్రీ ఉంటుందట. ఇప్పటికే సంజయ్ దత్ స్టోరీ మొత్తం వినేశారని, త్వరలోనే షూట్‌లో జాయిన్ అవబోతున్నారని సమాచారం. ఆయన రాకతో ఈ మూవీ రేంజ్ మరింత పెరగబోతుంది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











