మళ్లీ ఖల్‌నాయక్‌గా సంజయ్‌దత్.. కేజీఎఫ్‌ను అందుకే రిజెక్ట్ చేశాడు.. యష్
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మరోసారి ఖల్ నాయక్ అవతారం ఎత్తనున్నారు. ఇటీవల సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో విలన్ పాత్రను పోషించేందుకు సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే చిత్రం గురించి హీరో యష్ ఇటీవల వివరాలు అందించారు. యష్ చెప్పినదేమిటంటే..

కేజీఎఫ్ 2 మూవీకి రంగం సిద్ధం
కేజీఎఫ్ అందించిన విజయోత్సాహంతో రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ చిత్రంలో కీలక విలన్ పాత్ర కోసం కేజీఎఫ్ నిర్మాతలు ఇటీవల సంజయ్ దత్‌ను సంప్రదించగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

కేజీఎఫ్‌లోనే సంజయ్ దత్‌కు ఆఫర్
కేజీఎఫ్‌లో సంజయ్ దత్ భాగస్వామ్యం అవ్వడం గురించి యష్ స్పందించారు. వాస్తవానికి కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రంలో సంజయ్ దత్‌కు రోల్ ఆఫర్ చేశాం. కానీ డేట్స్ సమస్య వల్ల ఆయన నటించలేకపోయారు. కానీ కేజీఎఫ్2 కోసం మరోసారి సంప్రదించగా ఆయన ఒకే చెప్పారు అని యష్ పేర్కొన్నారు.

రూ.225 కోట్ల వసూళ్లు
డిసెంబర్ 25న రిలీజైన కేజీఎఫ్ చిత్రం సంచలన విజయం సాధించింది. దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.225 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో యష్ క్రేజ్ ఏంటో దేశవ్యాప్తంగా తెలిసింది. కేజీఎఫ్ సినిమా తర్వాత యష్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకదారణ లభించింది.

యష్ అనామక వ్యక్తి అని
ఇదిలా ఉండగా, కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రాని కంటే ముందు యష్ అంటే ఎవరో తెలియదు. కర్ణాటక వెలుపల ఆయన ఓ అనామక వ్యక్తి. కేజీఎఫ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత యష్ అందరికి తెలిసింది. దాంతో కేజీఎఫ్2 లో సంజయ్ దత్ నటించడానికి ఆసక్తి చూపాడు అని ఓ పత్రిక కథనంలో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











