నాన్నకు ప్రేమతో.. సునీల్ దత్ 15వ వర్ధంతిన.. సంజయ్ దత్ ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన తండ్రి సునీల్ దత్ వర్ధంతి రోజున చాలా ఎమోషనల్ అయ్యారు. బాలీవుడ్ దిగ్గజం సునీల్ దత్ 15వ వర్ధంతి రోజున ఆయనను తలచుకొని సంజయ్ దత్ భావోద్వగానికి గురయ్యారు. తన తండ్రితో కలిసి బాల్యంలో, యవ్వనంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి గుర్తు చేసుకొన్నారు. ఆ ఫోటో కనిపించే ఆప్యాయత, ప్రేమానురాగాలను చూస్తే వారిద్దరి మధ్య ఎంతటి గాఢమైన అనుబంధం ఉండేదో.. అలాంటి బంధాన్ని కోల్పోయిన సంజయ్ ఎలాంటి జీవితాన్ని కోల్పోయాడో అర్ధమవుతుంది.
తన తండ్రి సునీల్ వర్దంతి రోజున సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసి.. నీవు నా పక్కన ఉంటే.. దేని గురించి బాధపడాల్సిన అవసరం కలిగేది కాదు. నన్ను వెన్నంటి ఉండి ప్రోత్సహించిన జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ రోజే కాదు.. ప్రతీ రోజు నిన్ను మిస్ అవుతుంటాను నాన్న అంటూ సంజయ్ దత్ ఎమోషనల్ అయ్యారు.

తాజా ఇంటర్వ్యూలో సంజయదత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా నాన్ననే కారణం. ఆయన నాకు ఇన్సిపిరేషన్. ఆయన లేని లోటు నాకు ప్రతీ రోజు కనిపిస్తుంటుంది అని అన్నారు. ఆయనతో సన్నిహితంగా లేకపోయినా.. ప్రతీ అడుగులోను నా వెన్నంటి ఉన్నారు అని తెలిపారు.
సంజయ్ దత్ పోస్టు చేసిన వీడియోపై ఆయన కూతురు త్రిషాల దత్ స్పందిస్తూ.. 15 ఏళ్లు. తాతను ప్రతీ రోజు మిస్ అవుతూనే ఉన్నాం. ఆయన ఎక్కడ ఉన్నా శాంతంగా ఉండాలని కోరుకొంటాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











