బాయ్ ఫ్రెండ్ మరణించాడు, విషాదంలో స్టార్ హీరో కూతురు!

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూతురు త్రిషాలా దత్ విషాదంలో మునిగిపోయారు. బాయ్ ఫ్రెండ్ హఠాన్మరణంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అతడిని తాను ఎంత ప్రేమించానో వెల్లడిస్తూ... త్రిషాల దత్ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన లేఖ అందరినీ కలిచి వేస్తోంది.

ఈ సందర్భంగా త్రిషాలా దత్ తన బాయ్ ఫ్రెండుతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న త్రిషాలా కొంతకాలంగా అతడితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జులై 2) ఆమె ప్రియుడు మరణించాడు.

నా గుండె పగిలిపోయింది

నా గుండె పగిలిపోయింది

ఈ విషయం తెలియగానే నా గుండె పగిలిపోయింది. ఇంతకాలం నన్ను ప్రేమించినందుకు, నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు, నా గురించి కేర్ తీసుకున్నందుకు థాంక్యూ. నా జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా గడిపాను అంటే అందు కారణం నువ్వే. నీలాంటి వ్యక్తిని కలిసినందుకు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతురాలైన అమ్మాయిగా ఫీలయ్యాను. నీతో ఎంతో సంతోషకర జీవితం గడిపాను. నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ జీవించే ఉంటావు. ఐ లవ్ యూ.. నిన్ను ఎంతో మిస్సవుతున్నాను.... అంటూ త్రిషాలా దత్ పేర్కొన్నారు.

ఎవరు అతగాడు?

ఎవరు అతగాడు?

అయితే తన బాయ్ ఫ్రెండ్ గురించి వివరాలు త్రిషాలా వెల్లడించలేదు. కొన్ని నెలల క్రితం నుంచి త్రిషాల అతడితో దిగిన ఫోటోలు షేర్ చేస్తుండటంతో విషయం బయటకు వచ్చింది. తన సోషల్ మీడియా పోస్టులో ఎక్కడా కూడా అతడి పేరు ప్రస్తావించలేదు. ఇటాలీయన్ కుర్రాడితో తాను డేటింగ్ చేస్తున్నట్లు మాత్రమే వెల్లడించేవారు, తమ రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకునేవారు.

ప్రియుడి గురించి ఎంతో గొప్పగా

ప్రియుడి గురించి ఎంతో గొప్పగా

పలు సందర్భాల్లో త్రిషాలా దత్ తన ప్రియుడి గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘అతడు నా గొంతుపట్టుకుని లాగాడు.. కానీ నన్ను ఊపిరాడకుండా చేయడానికి కాదు. నన్ను కిస్ చేయడానికే అలా చేశాడు. ఆ సమయంలో నేను ఎవరి శ్వాస తీసుకున్నానో కూడా మరిచిపోయాను' అని గతంలో ఓ పోస్టులో వెల్లడించారు.

త్రిషాలా దత్

త్రిషాలా దత్

1996లో తన తల్లి బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిన తర్వాత త్రిషాలా దత్ తన ఆంటీ ఎన్నా శర్మ, గ్రాండ్ పేరెంట్స్‌తో కలిసి అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. న్యూయార్కులో ఆమె స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. సంజయ్ దత్ ప్రొడక్షన్స్‌కు ఆమె సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు న్యూయార్కులో డ్రీమ్ ట్రెసెస్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ అనే సంస్థను కూడా స్థాపించారు. సంజయ్ దత్ మొదటి భార్య రీచా శర్మ కూతురే త్రిషాలా దత్ అనే సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X