For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలాంటి మేసేజ్‌లతో వేధించాడు.. అందుకే అతడితో బ్రేకప్.. స్టార్ హీరో కూతురు ఎమోషనల్

  |

  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్ జీవితం గురించి దాదాపు సినిమాల మీద ఆస్తకి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన జీవితం ప్రయాణం వివాదాస్పదమే అయినా పెద్దగా రహస్యమేమీ ఉండదు. అన్నీ ఓపెన్. స్టార్ డమ్ రావడం, డ్రగ్స్‌కి బానిస కావడం, అఫైర్స్, డౌన్ ఫాల్, జైలు పాలు కావడం.. ఇలా ఒక సినిమాకి తగ్గ మెటీరియల్ దొరకడంతో ఆయన మీద సినిమా కూడా చేశారు. అయితే తాజాగా సంజయ్‌ దత్‏ కుమార్తె తన లవ్ అఫైర్ గురించి అంశాలు బయటపెట్టింది.

  అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

   చాట్ సెషన్ లో

  చాట్ సెషన్ లో

  తన మొదటి భార్య రిచా శర్మ ద్వారా సంజయ్ దత్ కి త్రిషాల దత్ జన్మించింది. వృత్తిరీత్యా ఆమె మానసిక వైద్యురాలు. ఆమె న్యూయార్క్ లో ప్రాక్టీస్ చేస్తోంది. మానసిక ఆరోగ్యం, మానవ సంబంధాలు వంటి అంశాల్లో సలహాలను కోరుకునే వ్యక్తులకు సహాయపడటానికి తరచుగా ఆమె ఇన్స్టాగ్రామ సెషన్‌ నిర్వహిస్తుంది. శనివారం రాత్రి, త్రిషాల తన ఫాలోవర్స్ తో ఈ సెషన్ నిర్వహించింది. సెలెబ్రిటీ చాట్ సెషన్ అంటే చాలు నెటిజెన్స్ ప్రశ్నల బాణాలు సిద్ధం చేసుకుంటారు. త్రిషాలా దత్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.

   అవును మోసపోయాను

  అవును మోసపోయాను

  ఒక నెటిజన్ ఎప్పుడయినా మోసపోయారా ? అని ప్రశ్నించారు. దానికి ఆమె "అవును" అని సమాధానం ఇచ్చింది. అలాగే తన లాంగ్ లాస్టింగ్ రిలేషన్ షిప్ ఎన్నాళ్ళు ఉందని అడగ్గా త్రిషాల ఏడు సంవత్సరాలు అని వెల్లడించింది. అలాగే అది ఎందుకు ముగిసిందనే దానిపై నేను డీప్ గా డీటైల్స్ చెప్పలేను. కానీ మేము పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము, అతను ఒక జీవితాన్ని ప్రరంబించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నేను లేనని అన్నారు. అది కాక మాకు చాలా, చాలా తేడాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. "క్లుప్తంగా - మేము ఇద్దరూ విడిపోయాము, ఈ రోజు, అతను వివాహం చేసుకున్నాడు పిల్లలతో సుఖంగా ఉన్నాడు, నేను అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని ఆమె పేర్కొంది.

  నేను క్షమించలేను

  నేను క్షమించలేను

  మరొక నెటిజన్ త్రిషాలను "మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా క్షమించారా? లేదా ఎక్స్ దగ్గరకి తిరిగి వెళ్ళారా ?" అని ప్రశ్నించాడు. దానికి ఆమె తాను క్షమించలేదని, తిరిగి వెళ్లలేదని చెప్పుకొచ్చింది. అలా క్షమించడం తప్పేమీకాదన్న ఆమె తాను మాత్రం అలా చేయాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే ప్రతి మనిషికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయని, తన అభిప్రాయం ప్రకారం తాను వెళ్లలేదని చెప్పుకొచ్చింది.

   దెప్పి పొడిచే వాడు

  దెప్పి పొడిచే వాడు

  అంతకుముందు, ఒక ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో, త్రిషాల తన రిలేషన్ లో తప్పు జరిగిందని పేర్కొంటూ, "అతను నాకు తెలియకుండానే నిశ్శబ్దంగా నా స్నేహితుల నుండి నన్ను వేరుచేశాడు. ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినా, అక్కడి నుంది ఇంటికి వచ్చినా అతనికి టెక్స్ట్ చేసే దానిని అని పేర్కొన్నారు. నేను బయటకి వెళ్లివచ్చినందుకు కూడా అతను ఫీల్ అయ్యే వాడని నేను ఏదో చేయకూడని పనిని చేస్తున్నానని అనిపించేలా ఎవరో ఇంటికి ఆలస్యంగా వచ్చారు' అంటూ దెప్పి పొడిచేవాడని ఆమె చెప్పుకొచ్చింది.

  మరో ప్రియుడి దుర్మరణం

  మరో ప్రియుడి దుర్మరణం

  ఇక రెండేళ్ళ క్రితం ఆమె మరో ప్రియుడు మరణించాడు. ఇదే విష‌యాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుని చాలా ఎమోష‌న‌ల్ పోస్ట్ కూడా పెట్టింది ఈ బ్యూటీ. సదరు ఇట‌లియ‌న్ అబ్బాయితో ఆమె చాలా రోజులు ప్రేమ‌లో ఉంది. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంటున్న త‌రుణంలో ఆయన చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మే.

  English summary
  Sanjay Dutt's daughter from his first wife Richa Sharma, Trishala Dutt recently conducted a chat session with her followers. as she is a psychotherapist by profession. She often conducts Instagram sessions to help people seeking advice on mental health, relationships. In her recent session she opens up about her past relationship.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X