డైలాగ్ లేదు కానీ టీజర్‌ అదిరింది.. ఆసక్తి రేపుతున్న 'ప్రస్థానం'

తెలుగులో విడుదలై సక్సెస్ సాధించిన ప్రస్థానం సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ప్రస్థానం చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన దేవా కట్ఠానే ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో సంజయ్ దత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ని హీరో సంజయ్ దత్ పుట్టిన రోజు కానుకగా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

ఒక నిమిషం 8 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ టీజర్ పలు ఆసక్తికర సన్నివేశాలు పొందుపరిచి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. పైగా కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్పితే ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

Sanjay Dutts Prasthanam teaser Out

గతంలో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ హిందీ రీమేక్ లో సంజయ్ దత్, జాకీ ష్రఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా మనీషా కొయిరాలా, చంకీ పాండే, అమైరా దస్తుర్, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ ని బట్టి చూస్తే.. తెలుగులో సాయి కుమార్ సాయి కుమార్ చేసిన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారని అర్థమవుతోంది. సంజయ్ దత్ ప్రొడక్షన్స్, ఎన్‌హెచ్ స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మానయత దత్ నిర్మాతగా ఉవహరిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 20 న హిందీ ప్రస్థానం విడుదల చేయబోతున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X