ఆమె ముఖం చాటేసింది.. భగ్న ప్రేమికుడిగా సంజయ్.. వీలుంటే ఆమెను పెళ్లి చేసుకొంటా?

By Rajababu

Recommended Video

Sanjay Dutt Talks About His Love Matter

సంజూ బయోపిక్ ట్రైలర్ రిలీజైన తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అఫైర్ల విషయం మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ట్రైలర్‌లో 'ఇప్పటి వరకు ఎంత మందితో పడుకున్నావు? అనే ప్రశ్నకు వేశ్యలను మినహాయించి 308 మందితో' అని సంజయ్ దత్ పాత్ర చేసిన రణ్‌బీర్ కపూర్ చేత చెప్పించారు. అంటే సంజయ్ దత్‌తో ఎంత మంది అమ్మాయిలతో సంబంధం ఉందో ఓ సారి ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంజయ్ దత్, మాధూరీ దీక్షిత్ లవ్‌ స్టోరీ తాజాగా మీడియాలో చర్చనీయాంశమైంది.

 సంజూ, మాధురీ అఫైర్ గురించి

సంజూ, మాధురీ అఫైర్ గురించి

1993లో సంజయ్, మాధురీ దీక్షిత్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ సినీ పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించాయి. సాజన్, ఖల్‌నాయక్ చిత్రాల్లో వారిద్దరూ సంజూ, మాధురీ కలిసి నటించిన తర్వాత వారిద్దరి జోడి చాలా ఫేమస్ అయింది. ఆ సమయంలో వారిద్దరూ పెళ్లి చేసుకొంటారనే వార్తలు వైరల్‌గా మారాయి.

సంజయ్ అరెస్ట్.. మాధురీ యూటర్న్

సంజయ్ అరెస్ట్.. మాధురీ యూటర్న్

సంజయ్ దత్ అనూహ్యంగా టాడా కేసులో అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు యూటర్న్ తీసుకొన్నాయి. బాలీవుడ్‌లో తాను దగ్గరనుకొన్నవాళ్లంతా దూరమయ్యారు. అలాగే మాధూరి దీక్షిత్ ముఖం చాటేసింది. ఆ తర్వాత అనేక మార్లు సంజయ్‌తో డేటింగ్ చేయలేదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని మాధురీ దీక్షిత్ వెల్లడించింది.

 మాధురీ దీక్షిత్ ముఖం చాటేసి

మాధురీ దీక్షిత్ ముఖం చాటేసి

సంజయ్ జైలు నుంచి రిలీజైన తర్వాత మాధురీ‌తో కలువడానికి ఇష్టపడలేదు. అలాగే సంజయ్ కూడా ముఖం చూపించకుండా తప్పించుకొన్నారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. తన పెళ్లయ్యేంత వరకు సంజయ్‌తో అఫైర్ గురించి మాధురీ దీక్షిత్ పెదవి విప్పలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అయితే మాధురీ దీక్షిత్‌పై సంజయ్ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని పలు సందర్భాల్లో అర్దమైంది.

 మాధురీ దీక్షిత్‌నే పెళ్లి చేసుకొంటా

మాధురీ దీక్షిత్‌నే పెళ్లి చేసుకొంటా

ఇటీవల ఓ పత్రికా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. నన్ను పెళ్లి చేసుకొమని ఎవరైనా ఆప్షన్ ఇస్తే కేవలం మాధురీ దీక్షిత్‌ను మాత్రమే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాధురీ దీక్షిత్‌పై ప్రేమ తరిగిపోలేదు అనే విషయం స్పష్టమైంది.

 బయోపిక్‌లో మాధురీ అఫైర్ గురించి

బయోపిక్‌లో మాధురీ అఫైర్ గురించి

సంజయ్ దత్ బయోపిక్‌లో మాధురీ దీక్షిత్ అఫైర్ గురించి ప్రస్తావన లేదట. తన పాత్రను బయోపిక్‌లో జొప్పించవద్దని మాధురీ సూచన మేరకు దర్శకుడు రాజు హిరాణి తగిన జాగ్రత్తలు తీసుకొన్నారట. అయితే రాజు హిరాణికి అలాంటి సలహా ఇవ్వలేదని మాధురీ ఖండించింది.

20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి

20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి

ఇదిలా ఉండగా, దాదాపు 20 సంవత్సరాల తర్వాత సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ కలిసి నటించనున్నారు. కరణ్ జోహర్ రూపొందిస్తున్న కాలాంక్ చిత్రంలో సంజయ్ సరసన మాధురీ దీక్షిత్ నటిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X