‘సంజు’ పై... మౌనం వీడిన సంజయ్ దత్ రియల్ లైఫ్ ఫ్రెండ్ కమలేష్!

By Bojja Kumar

Recommended Video

Sanjay Dutt Friend Responds On Sanju Movie

సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సంజు' మూవీ చూసిన వారంతా.... ఆయన రియల్ లైఫ్ ఫ్రెండ్ కమలేష్ కపాసి ఎవరు? ఎలా ఉంటారు? అని అన్వేషించడం మొదలు పెట్టారు. సంజయ్ జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో తండ్రి సునీల్ దత్ తర్వాత కమలేష్ కపాసి అని బయోపిక్‌లో చూపించడమే ఇందుకు కారణం. తెరపై ఈ పాత్రను విక్కీ కౌశల్ పోషించారు.

సినిమాలో చూపించినట్లు సంజు రియల్ లైఫ్ ఫ్రెండ్ పేరు కమలేష్ కపాసి కాదు. ఆయన అసలు పేరు పరేష్ ఘిలానీ. 'సంజు' సినిమా చూసిన అనంతరం పరేష్ ఘిలానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ద్వారా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

బెస్ట్ ఫ్రెండ్ భావోద్వేగం

బెస్ట్ ఫ్రెండ్ భావోద్వేగం

‘సంజు' చూసిన తర్వాత లిమిట్‌లెస్ ఎమోషన్స్‌తో నాకు మాట రాకుండా అపోయింది. వెంటనే సంజును గట్టిగా కౌగిలించుకుని ఏడవాలనిపించింది. నా మనసులో ఉన్న బాధనంతా బయటకు వెల్లగక్కాలనిపించింది' అని పరేష్ ఘిలానీ పేర్కొన్నారు.

సంజు జీవితంలో కీలకమైన వ్యక్తి

సంజు జీవితంలో కీలకమైన వ్యక్తి

‘సంజు' సినిమాలో కమలేష్ కపాసి పాత్ర గురించి వివరాల్లోకి వెళితే.... సంజయ్ దత్ తల్లి నర్గీస్ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు కమలేష్ పరిచయం అవుతాడు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. డ్రగ్స్ బారిన పడిన సంజయ్‌ను వాటికి దూరం చేయడంలో కమలేష్ కపాసి పాత్ర ఎంతో కీలకం అని సినిమాలో చూపించారు.

మంచి స్నేహితుడుగా...

మంచి స్నేహితుడుగా...

కేవలం సంజయ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే కాదు.... సునీల్ దత్‌కు కూడా ఎంతో దగ్గరైన వ్యక్తిగా కమలేష్ (పరేష్ ఘిలానీ) పాత్రను చూపించడం గమనార్మం. సంజును చెడు అలవాట్ల నుండి, చెడు సావాసాల నుండి దూరం చేయడంలో అతడు ఎంతగా తపించాడో సినిమాలో అద్భుతంగా ఫోకస్ చేశారు.

ఆ సంఘటనతో ఏళ్ల తరబడి దూరం...

ఆ సంఘటనతో ఏళ్ల తరబడి దూరం...

ముంబై బాంబు పేలుళ్ల సమయంలో జరిగిన ఓ సంఘటన తర్వాత కమలేష్ కపాసి సంజుకు దూరం అవుతాడు. ఆ సంఘన ఏమిటనేది, తెరపై చూస్తేనే బావుంటుంది.

వసూళ్ల పరంగా అదరగొడుతున్న ‘సంజు’

వసూళ్ల పరంగా అదరగొడుతున్న ‘సంజు’

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంజు' బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. తొలి వారం ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ బాలీవుడ్ టాప్ 5‌లో చోటు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X