విడాకులు ఇచ్చినా నాకు కోపం లేదు.. ఇంకా ప్రేమిస్తున్నాను.. భార్యతో స్టార్ హీరో తిరిగి కాపురం!

Recommended Video

Hrithik And Sussanne Get Back Together : Sanjay Khan

సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. అదే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తలు బయటకు వస్తే మీడియాలో వైరల్ గా మారడం ఖాయం. హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ జంట తమ 14 ఏళ్ల వివాహజీవితానికి తెరదించి విడాకుల ద్వారా విడిపోయినప్పుడు బాలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. విడాకుల తరువాత ఎవరి జీవితం వారు చూసుకోలేదు. పిల్లల కోసం స్నేహితులగా కలిసే ఉన్నారు. వీరిద్దరి విడాకుల గురించి సుసాన్నె ఖాన్ తండ్రి, నటుడు అయిన సంజయ్ ఖాన్ తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో సంజయ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కలసి పార్టీలకు

కలసి పార్టీలకు

చాలా రోజులుగా సుసాన్నె ఖాన్, హృతిక్ రోషన్ కలసి పిల్లలతో వెకేషన్స్, పార్టీలు, సినిమాలకు తిరుగుతున్నారు. స్టార్ సెలెబ్రిటీ జంట తిరిగి ఒక్కటి కాబోతున్నారనే వార్తలు అప్పటి నుంచే మొదలయ్యాయి. కానీ పిల్లల కోసం వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారని అంతా భావించారు. విడాకుల తరువాత కూడా వీరిద్దరూ ఇంత సన్నిహితంగా ఉండడంతో ఆసక్తిగా మారింది.

 తొలిసారి విడాకుల గురించి

తొలిసారి విడాకుల గురించి

సుసాన్నె ఖాన్ తండ్రి సంజయ్ ఖాన్ తొలిసారి విడాకుల గురించి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ ఇప్పటికి మంచి స్నేహితులుగా ఉండడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. విడాకులు తీసుకోవడం అనేది జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం.

నా కూతురిని ఇంతవరకు అడగలేదు

నా కూతురిని ఇంతవరకు అడగలేదు

విడాకుల కారణం ఏంటని ఇంతవరకు నేను నా కుమార్తెని అడగలేదు. ఈ విషయం సుసాన్నె, హృతిక్ కి మాత్రమే సంబందించిన విషయం అని సంజయ్ ఖాన్ అన్నారు. వారి మధ్య ఏం జరిగిందో వారికే తెలుసు. నా కుమార్తెని ఎంతగా ప్రేమిస్తున్నానో, హృతిక్ రోషన్ ని కూడా ఇప్పటికీ తాను అంతగా ప్రేమిస్తున్నాని సంజయ్ ఖాన్ అన్నారు. వారి మధ్య ఉన్న సమస్యలని పిల్లలపై పడకుండా స్నేహితులుగా ఉంటున్నారు. అది సంతోషాన్ని ఇచ్చే అంశం అని సంజయ్ ఖాన్ అన్నారు.

ఇప్పటికీ ఆశ ఉంది

ఇప్పటికీ ఆశ ఉంది

సుసాన్నె, హృతిక్ రోషన్ వారి మధ్య ఉన్న సమస్యలని పరిష్కరించుకుని తిరిగి జీవితం కొనసాగిస్తారనే ఆశ తనకు ఇప్పటికీ ఉందని సంజయ్ ఖాన్ అన్నారు. నా మనవళ్లకు హృతిక్ రోషన్ తండ్రి. ఈ బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు. సుసాన్నె, హృతిక్ తిరిగి జీవితం ప్రారంభిస్తారనే నేను నమ్ముతున్నాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని సంజయ్ ఖాన్ అన్నారు.

కంగన రనౌత్ వివాదం

కంగన రనౌత్ వివాదం

హృతిక్ రోషన్, కంగన రనౌత్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో, కంగనా రనౌత్ తో ప్రేమ లేఖల వివాదం కూడా అంతే సంచలనంగా మారింది. అప్పటి నుంచి హృతిక్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X