ప్రేమ పక్షుల కెమిస్ట్రీకి షాక్ అయిన డైరెక్టర్..దీపికా, రణవీర్ తో భారీ డీల్..!
తాను తీసే ప్రతి చిత్రం కళాత్మకంగా ఉండాలని భావిస్తారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన చిత్రాల్లో భారీ సెట్టింగులు, నటీనటుల ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయి. భన్సాలీ చివరగా తెరకెక్కించిన పద్మావత్ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేమ పక్షులు దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ నటన పద్మవత్ చిత్రంలో హైలైట్ అయింది. అంతుకు ముందు వచ్చిన భాజీ రావు మస్తానీ చిత్రం, రామ్ లీలా చిత్రాలలో దీపికా, రణవీర్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ తో భన్సాలీ భారీ డీల్ కుదుర్చుకున్నారని బాలీవుడ్ లో వార్త వైరల్ గా మారింది.

ఇప్పటికే మూడు చిత్రాలు
భన్సాలీ దర్శకత్వంలో దీపికా, రణవీర్ సింగ్ ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో రణవీర్ సింగ్, దీపికా మధ్య కెమిస్ట్రీకి ఆశ్చర్యపోయారట. ఆ చిత్రాలు విజయం సాధించడంలో దీపికా, రణవీర్ నటన కూడా ప్రధాన కారణం.

మరో బిగ్ డీల్
రణవీర్, దీపికా మధ్య కెమిస్ట్రీకి ముచ్చటపడ్డ భన్సాలీ వీరితో మరో బిగ్ డీల్ కుదుర్చుకున్నారట. మరో మూడు చిత్రాల్లో వీరిద్దరూ భన్సాలీ దర్శకత్వంలో నటించేలా ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇది భారీ డీల్ అని చర్చ జరుగుతోంది.

రియల్ లైఫ్ కెమిస్ట్రీ కూడా అదుర్స్
దీపికా, రణవీర్ బాలీవుడ్ లో హాటెస్ట్ కపుల్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ జంట సహజీవనం చేస్తున్నారు. ఈ జంట వెండితెరపై ఎంత చూడ ముచ్చటగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారు. ఇంకా వివాహం కాలేదు కాబట్టి బయట తిరిగితే పుకార్లు మొదలవుతాయని బెణుకు దీపికా రణవీర్ లకు ఏమాత్రం లేదు. ఎంచక్కా చెట్టాపట్టాలు వేసుకుని తెగ రొమాన్స్ చేసేస్తున్నారు.

రణవీర్ బెస్ట్ కిస్సర్ అంటూ కితాబు
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో దీపికా పాడుకొనే రణవీర్ సింగ్ గురించి హాట్ కామెంట్స్ చేసింది. రణవీర్ సింగ్ బెస్ట్ కిస్సర్ ఇన్ ది బిజినెస్ అంటూ వ్యాఖ్యానించి సెగలు రేపింది. ఇది చాలు వీరిద్దరి మధ్య ఎంతలా కెమిస్ట్రీ వర్క్ అవుతుందో చెప్పడానికి.


Click it and Unblock the Notifications










