twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్: పోలీసుల చెరలో భన్సాలీ.. 3 గంటల ప్రశ్నల వర్షం.. జర్నలిస్టుకు సమన్లు

    |

    సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని మూడు గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం మీడియా కథనాలపై విచారణ చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే సుశాంత్ మరణానికి కేవలం డిప్రెషన్ కారణమా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. సోమవారం సంజయ్ లీలా భన్సాలీ విచారణ సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    లీగల్ టీమ్‌తో కలిసి విచారణకు

    లీగల్ టీమ్‌తో కలిసి విచారణకు

    సుశాంత్ సూసైడ్ కేసులో జూలై 6న విచారణకు హాజరుకావాలంటూ జారీ చేసిన సమన్లకు స్పందిస్తూ సోమవారం సంజయ్ లీలా భన్సాలీ ముంబైలోని బాంద్రా పోలీసుల స్టేషన్‌కు వచ్చారు. తనతోపాటు తన లీగల్ టీమ్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు. 12.30 గంటలకు బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భన్సాలీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలీసుల వద్దే ఉన్నారు.

     ఆఫర్లు ఇచ్చి ఎందుకు వెనుకకు తీసుకొన్నారు?

    ఆఫర్లు ఇచ్చి ఎందుకు వెనుకకు తీసుకొన్నారు?

    విచారణ గురించి పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. సుశాంత్‌కు ఆఫర్లు ఇచ్చి ఆ తర్వాత ఎందుకు తిరస్కరించారు? సుశాంత్ మీతో ఎందుకు వర్క్ చేయలేకపోయారు? మీ మధ్య ప్రొఫెషనల్‌గా శతృత్వం ఏదైనా ఉందా? అంటూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అందుకు సమాధానంగా తన సినిమా ఆఫర్ ఇచ్చిన సమయంలో వేరే సంస్థతో సుశాంత్‌కు కాంట్రాక్టు ఉంది. ఆ కారణంగా మేమిద్దరం పనిచేయలేకపోయాం అని భన్సాలీ చెప్పినట్టు తెలిసింది.

    మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం

    మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం

    సుశాంత్ సూసైడ్ వెనుక పలు అనుమానాలు ఇంకా తలెత్తుతున్నాయి. పలువురు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా చాలా మందిని విచారించడానికి అవకాశం ఉంది. అవసరమైతే మరికొంత మంది సినీ ప్రముఖులను, సన్నిహితులను విచారించి సమాచారాన్ని సేకరిస్తాం అని పోలీసులు వెల్లడించినట్టు సమాచారం.

    మీడియా కథనాలపై పోలీసుల గురి

    మీడియా కథనాలపై పోలీసుల గురి

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో వచ్చిన మీడియా కథనాలపై కూడా ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. ఒక పత్రికలో వచ్చిన కథనాలపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆ కథనాన్ని రాయించారా? ఆ కథనం వెనుక వాస్తవం ఏమిటి? ఆ కథనానికి సోర్స్ ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి సదరు జర్నలిస్టును విచారణకు పిలువాలని ముంబై పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

    30 మందిని ప్రశ్నించిన ముంబై పోలీసులు

    30 మందిని ప్రశ్నించిన ముంబై పోలీసులు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఇప్పటి వరకు భన్సాలీతోపాటు 30 మందిని ప్రశ్నించారు. జూన్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని, రియా చక్రవర్తి, సంజనా సంఘీ, యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధులు, షాను శర్మతోపాటు మొత్తం 30 మందిని విచారించారు. ఈ కేసులో అవసరమైతే మరికొందరినికి కూడా విచారించడానికి వెనుకాడమని పోలీసులు స్పష్టం చేసినట్టు తెలిసింది.

    English summary
    Bollywood director Sanjay Leela Bhansali appeared for investigation related to Sushant Singh Rajput suicide case. He was questioned for 3 hours by Bandra Police. He was shooted few questions by polices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X