సుశాంతే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.. సెట్స్‌లో అలా ప్రవవర్తించేవాడంటూ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. డిప్రెషన్‌కు గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగి రెండు వారాలు అవుతున్నా ఇంకా అందరూ అదే దు:ఖంలో ఉన్నారు. సుశాంత్ ఆత్మహత్యపై రోజుకో చర్చ జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా మొత్తం సుశాంత్ సింగ్ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. బాలీవుడ్, నెపోటిజం, మాఫియానే సుశాంత్‌ను బలి తీసుకున్నాయని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput తన ప్రవర్తన వల్లే కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు..షూటింగ్ సమయంలో అందరికీ ఇబ్బంది?
సుశాంత్ మృతి..

సుశాంత్ మృతి..

గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌లోనే ఉన్న సుశాంత్ జూన్ 14న తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని సీబీఐ దర్యాప్తు చేయాలని నెటిజన్లు, ఫాలోవర్స్,ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ మృతి పట్ల బాలీవుడ్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

నెపోటిజంపై చర్చలు..

నెపోటిజంపై చర్చలు..

సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌లోని మాఫియా, నెపోటిజంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా, వివేక్ ఒబేరాయ్, సోను నిగమ్, అభినవ్ కశ్యప్ వంటి కొందరు సెలెబ్రిటీలు కూడా నెపోటిజంపై ఫైర్ అయ్యారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి పెద్దలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా సుశాంత్ మృతిపై శివసేన ఎంపీ సంచలన కామెంట్స్ చేశాడు.

 మానసిక స్థితి..

మానసిక స్థితి..

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సుశాంత్ సింగ్ మరణం గురించి, అతని వ్యక్తిత్వం గురించి సంచలన కామెంట్స్ చేశాడు. శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నాలో సుశాంత్ గురించి సంజయ్ రాసుకొచ్చాడు. సుశాంత్‌ది మర్డర్ కాదని, అతని మానసిక స్థితి బాగోలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు తెలిసిన ఓ సంఘటన గురించి కూడా బయటపెట్టాడు.

బాల్‌థాక్రే డిస్కషన్స్..

బాల్‌థాక్రే డిస్కషన్స్..

బాల్‌థాక్రే సినిమా విషయంలో ఓ పాత్ర కోసం తాము ఓ ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేశామని, అందులో సుశాంత్ కూడా ఒకరని పేర్కొన్నాడు. అయితే సుశాంత్ చాలా టాలెంట్ ఉన్న నటుడే అని, సెట్స్‌లో మాత్రం వింతగా ప్రవిర్తిస్తాడని, అతను ప్రస్తుతం డిప్రెషన్‌లో ఉన్నాడని, అతడిని తీసుకుంటే షూటింగ్ సమయంలో అందరికీ ఇబ్బంది కలుగుతుందని కొందరు తనకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిపాడు. సుశాంతే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడని సినీ వర్గాల నుంచి తనకు తెలిసిందని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X