Just In
Don't Miss!
- News
అందుకే షా అంటే మోడీకి గురి: ఎంట్రీతో అదుర్స్..ప్రతిపక్షాలు బెదుర్స్
- Lifestyle
వైరల్ వీడియో : కన్నతల్లిని ఢీకొట్టిందనే కోపంతో కారును కాలితో తన్నిన బుడ్డోడు... ఇంకా ఏం చేశాడంటే..
- Sports
టీమ్ సౌథీ Vs డేవిడ్ వార్నర్: పెర్త్ టెస్టులో మాటల యుద్ధం, అసలేం జరిగింది?
- Technology
ఈ స్మార్ట్ఫోన్లలో ఇంక వాట్సాప్ పని చేయదు... మీది ఉందేమో చూడండి
- Finance
12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- Automobiles
టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
‘సంజు’ బయోపిక్... సంజయ్ దత్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'సంజు' బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని తేలి పోయంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 300 కోట్లు వసూలు చేయడంతో పాటు వీకెండ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్‌రన్‌లో బాలీవుడ్లో చాలా కాలంగా పాతుకుపోయిన పలు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఇంత ఆదరణకు కారణం..
‘సంజు' మూవీకి ఇంత ఆదరణ లభించడానికి ప్రధాన కారణం సంజయ్ దత్ జీవితంలో అసలు ఏం జరిగింది? ఆయన చుట్టూ ఉన్న వివాదాలు, కేసుల వెనక అసలు కారణాలు ఏమిటి? అనే ఆసక్తి ప్రజల్లో ఉండటమే. వారిలో ఉన్న క్యూరిసిటీకి తోడు... రణబీర్ ఉత్తమ నటన, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ బయోపిక్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ షేక్ అవుతోంది.

సంజయ్ దత్‌కు ఏంటి?
ఇది సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇది ఆయన సొంత కథ. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే ఆయన కథ తమ సినిమాకు వాడుకున్నందుకు నిర్మాతలు రూ. 10 కోట్ల ఆఫర్ చేశారట. దీంతో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ కూడా ఇవ్వబోతున్నారట.

బ్యాడ్ బాయ్ ఇమేజ్ పోయినట్లేనా?
సినిమా విడుదల ముందు వరకు సంజయ్ దత్ మీద ఒక బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉండేది. అయితే ఈ సినిమా తర్వాత చాలా వరకు ఇది చెరిగిపోయిందనే చెప్పాలి. అయితే కొందరు మాత్రం ఈ సినిమాలో చాలా నెగెటివ్ అంశాలను దాచేసి సంజయ్‌ను మంచోడిలా చూపించే ప్రయత్నం చేశారని, అతడో ఉమనైజర్ అని విమర్శిస్తున్నారు.

రణబీర్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
రణబీర్ కపూర్ కెరీర్లో ‘సంజు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్టులేక వెనకబడిపోయిన రణబీర్... ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ మూవీలో రణబీర్ నటన కూడా అద్భుతంగా ఉండటంతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల దృష్టి రణబీర్ మీద పడింది. అతడితో భారీ బడ్జెట్ చిత్రాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట.