రెచ్చిపోయిన యానిమల్ విలన్ చెల్లెలు .. ఆ ప్లేస్‌తో టాటూతో పబ్లిక్‌గా
నటీనటులు టాటూ వేసుకోవడం టాలీవుడ్ టూ బాలీవుడ్ కామన్‌గా మారిపోయింది. అయితే కొందరి టాటూలు మాత్రం హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇలాంటి టాటూతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని - ధర్మేంద్రల కుమార్తె ఈషా డియోల్. అందరిలాగా కాకుండా విచిత్రంగా ఆవిడ టాటూ ఉండటం చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
ధర్మేంద్ర- హేమామాలిని దంపతులకు 1981 నవంబర్ 2న జన్మించారు ఈషా డియోల్ . బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, బాబీ డియోల్‌కు ఈమె చెల్లెలు అవుతారు. తల్లి బాటలోనే సాంప్రదాయ నృత్యం నేర్చుకున్న ఈషా డియోల్ పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఆమెలో నృత్యకారిణి మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా ఉన్నారు. అలాగే హ్యాండ్ బాల్‌లోనూ ఈషా డియోల్‌కు ప్రావీణ్యం ఉంది. 2001లో పంజాబ్‌లో జరిగిన సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో మహారాష్ట్ర తరపున ఫుట్‌బాల్ ప్లేయర్‌గానూ ఈషా డియోల్ ప్రాతినిథ్యం వహించారు.

2002లో కోయి మేర దిల్ సే పూచా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు ఈషా డియోల్. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2002 నుంచి 2008 వరకు కేవలం ఆరేళ్లలోనే 30కి పైగా సినిమాలలో నటించి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. అయితే తల్లి రేంజ్‌లో స్టార్ హీరోయిన్ రేసులో మాత్రం ఈషా వెనుకబడ్డారు. అలాగే మధ్యలో కొన్నేళ్లు యాక్టింగ్ కెరీర్‌కు కూడా దూరం కావడంతో ఈషా డియోల్ తన స్టార్‌డమ్‌ను నెమ్మదిగా కోల్పోయారు. ప్రస్తుతం గెస్ట్ రోల్స్ , చిన్నాచితకా పాత్రలకే ఆమె పరిమితమయ్యారు.
ఈషా డియోల్ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. 2012లో భరత్ తక్తానీని పెళ్లాడిన ఈషా డియోల్‌కు ఓ పాప, బాబు జన్మించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ జంట విడాకులు తీసుకోబోతుందని పలుమార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వీటిపై ఇద్దరూ స్పందించలేదు. కానీ ఓ రోజు తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఈ జంట బాంబు పేల్చింది. కానీ విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటనేది మాత్రం తెలియరాలేదు.
కాంట్రవర్సీ కామెంట్స్‌తోనూ ఈషా డియోల్ వార్తల్లో నిలుస్తుంటారు. మొన్నామధ్య రిలేషన్‌షిప్ , పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్‌తో సమానంగా ఉండాలని, ఆర్ధిక విషయాల్లోనూ దాపరికాలు ఉండకూడదని ఈషా డియోల్ అభిప్రాయపడ్డారు. రిలేషన్‌షిప్‌లోనూ ఫ్రెండ్‌షిప్ ఉండాలని, మనం చేసే పనికి అవతలి వాళ్ల నుంచి ఎలాంటి అడ్డు ఉండకూడదని ఈషా డియోల్ తెలిపారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈషా డియోల్ తన వ్యక్తిగత వివరాలు, సినిమాలు, ఇతర సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఫంక్షన్‌కు హాజరైన ఈషా డియోల్ తన వీపుకు కుడి భాగంలో వేయించుకున్న టాటూ వైరల్ అవుతోంది. హిందువుల ఆరాధ్య దైవం గాయత్రి మాతకు చెందిన గాయత్రి మంత్రాన్ని సంస్కృత భాషలో వేయించుకున్నారు ఈష. ప్రస్తుతం ఈషా డియోల్ టాటూకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











