7 గంటలు బికినిలో.. నరకం చూపించారు, డైరెక్టర్‌ని వేడుకున్నా.. తొలిప్రేమ బ్యూటీ సంచలనం!
Recommended Video

తనుశ్రీ దత్త లైంగిక ఆరోపణలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. హార్న్ ఓకే ప్లీజ్ చిత్ర షూటింగ్ సందర్భంగా సీనియర్ నటుడు నానా పాటేకర్ తనని లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు చేసింది. తనుశ్రీ దత్తకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దత్తు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా తనుశ్రీ దత్తకు నానా పాటేకర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తనుశ్రీ దత్తకు మద్దత్తు తెలుపుతున్న వారి జాబితాలో యంగ్ బ్యూటీ సప్నా పబ్బి కూడా చేరింది.

తొలిప్రేమ చిత్రంలో
వరుణ్ తేజ్ సూపర్ హిట్ చిత్రం తొలిప్రేమలో సప్నా ఓ సాంగ్ లో మెరిసింది. సప్నా నటించిన ఏకైన తెలుగు చిత్రం అదే. కేవలం సాంగ్ మాత్రమే అయినా సప్నా మోడ్రన్ యువతిగా తెలుగు యువకుల్ని ఆకట్టుకుంది.

తనుశ్రీ దత్తకు మద్దత్తు
హాట్ హాట్ గా సాగుతున్న తనుశ్రీ దత్త, నానా పాటేకర్ వ్యవహారం గురించి సప్నా స్పందించింది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాల్ని సహించకూడదు. నేను తనుశ్రీ దత్తకు మద్దత్తు తెలుపుతున్నా అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

నరకం చూపించారు
ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా దర్శకుడి నుంచి తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని సప్నా సంచలన విషయం బయట పెట్టింది. షూటింగ్ లో భాగంగా దర్శకుడు, నిర్మాత తనకు నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళతో తన స్టైలిష్ట్ కూడా చేతుల కలిపి ద్రోహం చేసిందని పేర్కొంది.

7 గంటలు బికినిలో
షూటింగ్ లో భాగంగా ఏమాత్రం సౌకర్యంగా లేని బిగుతైన బికినీ వేసుకోమన్నారు. ఆ బినికి ధరించిన కాసేపటికే ఎద భాగంలో నొప్పి మొదలైంది. ఈ విషయం దర్శకుడికి చెప్పి కాస్ట్యూమ్స్ మార్చమని వేడుకున్నా. తన భాదని అర్థం చేసుకోకపోగా వెకిలిగా నవ్వాడు. నా స్టయిలిష్ట్ తోడుగా నిలవకుండా అతడితో కలసి నవ్వింది. ఆ సంఘటన తనని చాలా వేదనకు గురిచేసిందని సప్నా పబ్బి సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

బయటకు చెబితే
ఈ విషయం గురించి తాను బయట మాట్లాడితే ఎక్కడ అవకాశం పోతుందో అని ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్నట్లు సప్నా తెలిపింది. 24 సిరీస్ లో సప్నా నటించింది. సప్నా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఈ షోని ఉద్దేశించినవిగానే ఉన్నాయి. ఈ టివి షోలో అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











