అక్కడి వెళ్లి చూడండి మేము కలిసే ఉంటాము.. హీరోయిన్ కౌంటర్స్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. పొట్టి బట్టలేసుకుని షేర్ చేసే ఫోటోలకు వేల లైకులు పడుతూ ఉంటాయి. ఈ సుందరిని సినిమాల కంటే.. ప్రేమ వ్యవహారమే ఎక్కువ ఫేమస్ చేసింది.
సారా అలీ ఖాన్ ఇంత వరకూ కేవలం రెండు సినిమాలే చేసింది. కానీ వార్తల్లో మాత్రం ఎప్పుడూ నిలుస్తూనే వస్తోంది. తనతో కలిసి నటించిన కార్తిక్ ఆర్యన్‌తో సారా అలీఖాన్ డేటింగ్ చేస్తున్నట్టు బాగా ప్రచారమవుతోంది. గతంలో కాఫీ విత్ కరణ్ షో అనే కార్యక్రమంలో సారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కార్తిక్ అంటే తనకు ఇష్టమని మనసులో విషయాన్ని సారా వెల్లడించింది. ప్రస్తుతం కార్తిక్‌తో కలిసి సారా 'లవ్ ఆజ్ కల్' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 14న వాలెంటైన్స్ కానుకగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కార్తిక్‌తో తన బంధం గురించి స్పష్టతనిచ్చింది. అందరూ అనుకున్నట్టు తమ మధ్య అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. కార్తిక్‌తో కలిసి ఉండటం చూడాలంటే.. కేవలం అది సినిమాలో మాత్రమేనని తెలిపింది. తమను చూడాలనుకుంటే థియేటర్‌కు వెళితే అక్కడ కలిసే కనిపిస్తామని ఎంతో తెలివిగా సమాధానం చెప్పింది. అంతేకాదు, ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదని, భవిష్యత్‌లో కూడా రావని చెప్పలేనని ఎంతో అనుభవమున్నదానిలా మాట్లాడుకొచ్చింది. తనేంటో తన అంతరాత్మకు తెలుసని చెప్పింది. లోపల ఒకలా, బయటికి మరోలా ఉండాల్సిన అవసరం తనకు లేదని ఆమె కుండబద్దలు కొట్టింది.


Click it and Unblock the Notifications











