డ్రగ్ కేసు విచారణ.. ట్విస్ట్ ఇచ్చిన సారా ఆలీ ఖాన్.. తెరపైకి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు, సెలబ్రిటీలు

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో సినీ తారలు, వారి మేనేజర్లను విచారిస్తున్న క్రమంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పలు కోణాల్లో లోతైన విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారులకు సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, టాలెంట్ మేనేజర్ జయ సాహా విచారణలో మరి కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఈ విచారణ వివరాల్లోకి వెళితే..

తెరపైకి ఇద్దరు నిర్మాతల పేర్లు

తెరపైకి ఇద్దరు నిర్మాతల పేర్లు

ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ సంబంధించిన ధర్మ ప్రొడక్షన్‌కు చెందిన క్షితిజ్ రవి ప్రకాశ్ ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత పలు కోణాల్లో విచారించారు. ఈ సందర్భంగా ఐదుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు, మరో ఇద్దరు నిర్మాతల పేర్లు చెప్పినట్టు తెలిసింది. అయితే వారి పేర్లు ఎన్సీబీ అధికారులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తున్నది. త్వరలోనే మరికొందరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

 దీపికకు డ్రగ్స్ సంబంధం లేదు

దీపికకు డ్రగ్స్ సంబంధం లేదు

ఇక దీపిక మేనేజర్ కరిష్మ ప్రకాశ్‌ను శుక్రవారం 7 గంటలపాటు విచారించిన తర్వాత శనివారం మరోసారి విచారణకు పిలిచారు. శుక్రవారం విచారణలో దీపికకు డ్రగ్స్ వాడకంతో సంబంధం లేదు. ఆమె ఆరోగ్యంపై చాలా జాగ్రత్త వహిస్తారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటారనే విషయాన్ని అధికారులకు చెప్పినట్టు సమాచారం.

రియా చక్రవర్తితో ఛాటింగ్ నిజమే

రియా చక్రవర్తితో ఛాటింగ్ నిజమే

ఇక జయ సాహాను మరోసారి ఎన్సీబీ విచారిస్తున్నది. అయితే తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదు. రియా చక్రవర్తితో చాటింగ్ జరిపిన విషయం నిజమే. అయితే చాటింగ్‌లో ఉపయోగించిన పదాలు డ్రగ్స్ కావు. సిగరెట్లను ఆ పేర్లతో పిలుస్తారు. కానీ వాటిలో మారిజువానా అలాంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉండవని వెల్లడించినట్టు తెలిసింది. ఉన్నత, సంపన్న వర్గాల్లో సిగరెట్లను హాష్ అంటారని పేర్కొన్నట్టు సమాచారం.

ట్విస్టు ఇచ్చిన సారా ఆలీ ఖాన్

ట్విస్టు ఇచ్చిన సారా ఆలీ ఖాన్

డ్రగ్స్ కేసు‌లో సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్‌ శనివారం విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరయ్యే విషయంలో సారా ఆలీ ఖాన్ చిన్న ట్విస్టు ఇచ్చింది. విచారణకు 10.30 గంటలకు హాజరు కావాల్సి ఉండగా రాలేను. 12.30 గంటలకు హాజరవుతానని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 12.30 గంటలకు ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X