స్టార్ హీరో కూతురు నా వెంటపడింది.. నాకు కన్నీళ్లు ఆగలేదు, ఒక్క మాట అడగలేదు!
సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయి సారా అలిఖాన్ క్రేజ్ బాలీవుడ్ లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల కేదర్ నాథ్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సారా.. ఆ తర్వాత రణవీర్ సింగ్ సరసన సింబా చిత్రంలో నటించింది. ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సింబా చిత్రానికి మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో సారా అలీఖాన్ ని హీరోయిన్ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు దర్శకుడు రోహిత్ శెట్టి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నా వెంటపడేది
సారా అలీఖాన్ సైఫ్ అలీఖాన్, అమృత సింగ్ ముద్దుల కుమార్తె. సింబా చిత్రాన్ని తాను తెరకెక్కించబోతున్నాని తెలిసిన తర్వాత సారా ప్రతి రోజు నా వెంట పడేది. తనని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని ప్రతి రోజు రిక్వస్ట్ చేసేది. ఈ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్ గా సరిపోతుందా అని ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నాను. అప్పటివరకు హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.

కన్నీళ్లు ఆగలేదు
అవకాశం ఉన్న ప్రతిసారి నా వెంట పడుతూ రిక్వస్ట్ చేసేది. సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్ హీరో కుమార్తె అవకాశం కోసం నా వెంట పడేసరికి ఎమోషనల్ అయ్యాక. నా కళ్ళు చెమ్మగిల్లాయి. సైఫ్ తలచుకుంటే ఇంతకన్నా పెద్ద చిత్రాల్లో ఆమెకు అవకాశం వస్తుంది. కానీ అలా చేయలేదు. సొంతంగా ఎదగాలనే కమిట్మెంట్ ఆమెలో కనిపించిందని రోహిత్ శెట్టి తెలిపారు. చివరకు సారానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

బతిమిలాడినా పట్టించుకోలేదు
సింబల్ కేవలం కమర్షియల్ మూవీ మాత్రమే కాదు. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కోసం రోహిత్ శెట్టిని తాని చాలా రోజులపాటు బతిమిలాడా అని సారా తెలిపింది. మొదట్లో ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత తననే హీరోయిన్ గా ఎంపిక చేసాం అని చెప్పేసరికి చాలా సంతోషపడ్డా అని సారా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఫ్యూచర్ స్టార్
బాలీవుడ్ లో సారా అలీఖాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ ప్రశంసలుఅందుకుంటోంది. అందుకు ఆమె గ్లామర్ మాత్రమే కాదు.. వాక్చాతుర్యం, చలాకీతనం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. హీరోయిన్ కాకముందు తన గ్లామర్ తో ఆకట్టుకున్న సారా అలీఖాన్.. కేదర్ నాథ్, సింబా చిత్రాలలో నటనతో మెప్పించింది.


Click it and Unblock the Notifications











