For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవర్‌కు బ్రేకప్‌ చెప్పిన సూపర్ స్టార్ కుమార్తె.. కారణం అదేనంటూ

  |

  బాలీవుఢ్‌లో ప్రేమలు, పెళ్లిళ్ల లాంటి సంబంధాలు ఎక్కువ కాలం నిలువలేవనే విషయాలకు ఎన్నో జంటల కథలు మనకు తెలిసిందే. అఫైర్లు, డేటింగుల విషయంలో ఎవరు ఎవరితో ఉంటారే చెప్పడం కష్టంగానే అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇండస్ట్రీలో చోటా నవాబ్ సైఫ్ ఆలీఖాన్ ముద్దుల కూతురు ప్రేమ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేస్తుండటం తెలిసిందే. అయితే తన ప్రియుడికి ఇప్పుడు దూరమైందనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే వారిద్దరి బ్రేకప్ కారణాల గురించి వివరాల్లోకి వెళితే..

   కొంతకాలంగా సారా, కార్తీక్ డేటింగ్

  కొంతకాలంగా సారా, కార్తీక్ డేటింగ్

  బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన యువ జంట ఎవరంటే ఠక్కును చెప్పే పేర్లు ఆర్యన్ కార్తీక్, సారా ఆలీ ఖాన్. వీరిద్దరు కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో నానుతున్నది. వారిద్దరి బహిరంగ ప్రదేశాల్లో జంటగా కనిపించి మీడియా కెమెరాలకు చిక్కిన విషయం కొత్తేమీ కాదు. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సన్నిహితులు చెప్పుకొంటారు.

  రణ్‌వీర్ సింగ్ వల్లే పరిచయం

  రణ్‌వీర్ సింగ్ వల్లే పరిచయం

  సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ మధ్య పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ వల్ల వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం స్నేహంగా.. అనంతరం ప్రేమలో పడేలా చేసింది. చాలా కాలంగా వారిద్దరి మధ్య విడదీయలేనంత ప్రేమ ఉందనే సందర్భాలు చాలానే మీడియా దృష్టికి వచ్చాయి.

   బాంక్యాక్‌కు వెళ్లి బర్త్ డే పార్టీలో

  బాంక్యాక్‌కు వెళ్లి బర్త్ డే పార్టీలో

  సారా ఆలీఖాన్, ఆర్యన్ కార్తీక్ మధ్య ప్రేమ ఎంత బలమైనదనే విషయానికి ఓ ఉదాహరణగా తాజా సంఘటనను చెప్పుకోవచ్చు. కూలీ నెంబర్ 1 సినిమా షూటింగ్ కోసం సారా ఆలీఖాన్ బ్యాంకాక్‌కు వెళ్లారు. అయితే తన పుట్టిన రోజున బర్త్ డే గిఫ్టుగా ఉంగరం ఇవ్వడానికి కార్తీక్ ఆర్యన్ అక్కడికి వెళ్లి సెట్లో వాలిపోయాడు. ఆ తర్వాత సీక్రెట్‌గా ఈద్ వేడుకను జరుపుకొన్నారనే వార్త మీడియాలో గుప్పుమంది.

   ఇటీవలే బ్రేకప్ చెప్పుకొన్నారని

  ఇటీవలే బ్రేకప్ చెప్పుకొన్నారని

  ఇలా పీకల్లోతు ప్రేమలో మునిగిన సారా ఆలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ మధ్య బ్రేకప్ జరిగిందనే వార్త బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా మారింది. అయితే వారిద్దరు విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తమ అకౌంట్ల నుంచి అన్‌ఫాల్ అయిపోవడం ఈ వార్తకు మరింత బలం చేకూరింది. కార్తీక్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో 544 మందిని ఫాలో అవుతున్నారు. ఆ ఫాలోవర్స్ లిస్టులో సారా పేరు కనిపించడం లేదు. ఇక సారా అకౌంట్‌లో 71 మందిని ఫాలో అవుతున్నారు. ఆ జాబితాలో కార్తీక్ కనిపించకపోవడంతో వారిద్దరి మధ్య ఏదో జరగకూడదనిది జరిగిందనే నిర్ధారణకు వచ్చారు.

   లవ్ ఆజ్ కాల్ తర్వాత దూరంగా

  లవ్ ఆజ్ కాల్ తర్వాత దూరంగా

  సారా ఆలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ కలిసి ఇటీవల ఇంతియాజ్ ఆలీ దర్శకత్వం వహించిన లవ్ ఆజ్ కల్ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాతనే వారిద్దరి బ్రేకప్ జరిగింది. లవ్ ఆజ్ కల్ మూవీ ప్రమోషన్స్ తర్వాత వారిద్దరి కలిసి కనిపించలేదనే విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు వారిద్దరి ప్రేమపై కంటే కెరీర్‌పై దృష్టిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకే బ్రేకప్ చెప్పుకొన్నారనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

  Kartik Aaryan Reveals His Crush On Sara Ali Khan !
   కార్తీక్, సారా ఆలీఖాన్ కెరీర్ గురించి

  కార్తీక్, సారా ఆలీఖాన్ కెరీర్ గురించి

  బాలీవుడ్‌లో సారా ఆలీఖాన్, కార్తీక్ ఆర్యన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కార్తీక్ ఆర్యన్ భూల్ బులయ్యా 2, దోస్తానా 2 చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారు. సారా ఆలీఖాన్ కూలీ నంబర్ 1, అత్రంగీ రే అనే చిత్రాల్లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. వచ్చే ఏడాది ఈ యువ తారలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Bollywood young actress Sara Ali Khan breakup with Kartik Aaryan goes viral in social media. Star actor Saif Ali Khans daughter was in dating mood for quite sometime. After Lov Aaj Kal promotion, They were on unfollowed each other in instagram and keeping away from relations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X