twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: మతిపోగొడుతున్న స్టార్ హీరో కూతురు.. స్టెప్పులతో కేక పెట్టించింది!

    |

    Recommended Video

    Sara Ali Khan Dances At The Party

    సినీ స్టార్ల వారసులు ఆ రంగంలోకి అడుగు పెట్టకముందే పెద్ద సెలెబ్రిటీలు గా మారిపోతుంటారు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ వారసులు ఇలా వార్తల్లో నిలుస్తున్నా సంగతి తెలిసిందే. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం కూడా ఇంత వరకు విడుదల కాలేదు. కానీ జాన్వీ ఎంత పెద్ద సెలెబ్రిటీనో అందరికి తెలిసిందే. జాన్వీ కపూర్ ప్రస్తుతం దఢక్ చిత్రంలో నటిస్తోంది. ఇకమరో సెలెబ్రిటీ వారసురాలు, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీఖాన్ సోషల్ మీడియాని ఓ రేంజ్ లో దున్నేస్తోంది. ఇటీవల ఓ పార్టీలో సారా మెరిసింది. అక్కడ ఆమె స్టెప్పులతో చేసిన రచ్చ సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

    సైఫ్ వారసురాలిగా

    సైఫ్ వారసురాలిగా

    సైఫ్ అలీఖాన్, అమృతసింగ్ ముద్దల తనయి సారా అలీఖాన్. బాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే ఈ అమ్మడు హాట్ సెలేబ్రిటిగా మారిపోయింది. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కు యువత ఫిదా అయిపోతున్నారు.వివిధ వేడుకల్లో మెరుస్తూ ఈ భామ బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడుతోంది.

    టెంపర్ రీమేక్‌లో ఛాన్స్

    టెంపర్ రీమేక్‌లో ఛాన్స్

    సారా ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో గోల్డెన్ ఆఫర్ సారాని వెతుక్కుంటూ వచ్చింది. ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం హిందీలో సింబ గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ సరసన అంటించే అవకాశం దక్కనుంచుకుంది.

    యువతలో క్రేజ్

    యువతలో క్రేజ్

    సారా గ్లామర్ కు యువత ఫిదా అవుతున్నారు. ఆమె నటించిన చిత్రం ఒకటి కూడా విడుదల కాక ముందే భారీ క్రేజ్ ఏర్పరుచుకుంది. ఈ జనరేషన్ బాలీవుడ్ హీరోయిన్ గా సారా చక్రం తిప్పడం ఖాయం అని అంచనాలు మొదలయ్యాయి.

    స్టెప్పులతో ఇరగదీసింది

    ఇటీవల సారా ఓ వివాహ వేడుక కు హాజరైంది. ఆ వేడుకలో సారా చీరకట్టులో అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సారా 'సాథ్ సముందర్ పార్' అనే సాంగ్ కు అదిరిపై స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం సారా డాన్స్ వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. లయబద్దంగా ఆమె వేసిన స్టెప్పులు యువతని చూపు తిప్పుకోనీయడం లేదు.

    English summary
    Sara Ali Khan dances to Saat Samundar Paar at wedding reception. Video goes viral in internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X