ఒకరితో డేటింగ్, మరొకరితో పెళ్లి.. హీరోయిన్ కోరిక.. డబ్బు ఉంటే తీసుకెళ్లొచ్చు!

Recommended Video

Sara Ali Khan Talks About Her Desire To Marry Ranbir Kapoor

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీఖాన్ కేదర్ నాథ్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారం కోసం కాబోలు.. టీవీల్లో తెగ రచ్చ చేస్తోంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న హీరోయిన్లు ఎవరైనా కాస్త సైలెంట్ గా ఉంటారు. కానీ సైఫ్ కూతురుకి ఒళ్ళంతా వెటకారం టన్నుల కొద్దీ ఉన్నట్లు ఉంది. ఆమె మాట్లాడే ప్రతి మాటకు పక్కనున్నవారు పగలబడి నవ్వేస్తున్నారు. కాఫీ విత్ కరణ్, రెడ్ ఎఫ్ఎమ్ షోలలో సారా అలీఖాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

సినిమాల్లోకి రాకముందు

సినిమాల్లోకి రాకముందు

సారా అలీఖాన్ బాలీవుడ్ లోకి రాకముందు సైఫ్ కుమార్తెగా, అందాల యువతిగా అందరిని ఆకర్షించింది. కానీ పెద్దగా ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. కేదర్ నాథ్ చిత్ర ప్రచారం కోసం పలు షోలలో పాల్గొంటోంది. ఆమె అందమైన పలుకులు వింటుంటే సైఫ్ కూతురు ఇంత మాటకారా అని అనిపించక మానదు. ఎలాంటి విషయం గురించి అయినా సిగ్గు, బెణుకు లేకుండా సరదాగా మాట్లాడేస్తోంది.

 ఒకరితో డేటింగ్, మరొకరితో పెళ్లి

ఒకరితో డేటింగ్, మరొకరితో పెళ్లి

కాఫీ విత్ కరణ్ షోలో సారా అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సరదాగా ఉంటూనే వైరల్ అవుతోంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. నాకు రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ డేటింగ్ మాత్రం అతడితో చేయను. డేటింగ్ చేయాలను కుంటే కార్తీక్ ఆర్యన్ తో చేస్తా అంటూ హాట్ కామెంట్స్ ని చాలా సరదాగా చెప్పేసింది.

డబ్బులుంటే తీసుకెళ్లొచ్చు

డబ్బులుంటే తీసుకెళ్లొచ్చు

తన తండ్రిని పక్కన పెట్టుకునే సారా ఈ వ్యాఖ్యలు చేసింది. సైఫ్ అలీఖాన్ కూడా అంటే సరదాగా స్పందించాడు. కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తా అని సారా అనగానే.. అతడి వద్ద అంత డబ్బు ఉందా అని సైఫ్ అనడంతో కరణ్ పగలబడి నవ్వేశాడు. నీ వద్ద డబ్బు ఉన్నా ఈమెని డేటింగ్ కు తీసుకుని వెళ్ళవచ్చు అని సైఫ్ కరణ్ తెలిపాడు. మీరలా మాట్లాడకూడదు.. చాలా తప్పు అంటూ సారా సిగ్గుపడుతూ తండ్రిని వారించింది. తన కుమార్తెతో పెట్టుకుంటే పర్సు ఖాళీ అవుతుందని సైఫ్ ఇలా పరోక్షంగా చెప్పాడు.

 ఇప్పుడు అనుకోవడం లేదు

ఇప్పుడు అనుకోవడం లేదు

సారా అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు రెడ్ ఎఫ్ఎం రేడియో షోలో చర్చకు వచ్చాయి. కేదర్ నాథ్ చిత్రం కోసం రెడ్ ఎఫ్ఎమ్ షోలో సుశాంత్ సింగ్, సారా అలీఖాన్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. అక్కడున్న డీజే సారా అలీఖాన్ చేసిన రణబీర్ తో పెళ్లి, కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ వ్యాఖ్యలని ప్రస్తావించింది. మరోమారు సారా అలీఖాన్ సరదాగా బదులిచ్చింది. ఒకప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఇప్పుడు అనుకోవడం లేదు అని తెలిపింది.

మనుషులు మారిపోతారుగా

మనుషులు మారిపోతారుగా

మనుషులు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరు కదా.. అందుకే నా ఆలోచన కూడా మార్చుకున్నా అంటూ సారా అలీఖాన్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు రణబీర్ అలియాతో దోస్తీ చేస్తున్నాడు కదా అని అక్కడున్న ఆర్ జె అనగా.. వాళ్లిద్దరూ దోస్తీ చేస్తే ఏం.. అసలు అది సమస్యే కాదు.. మాది కూడా జరిగిపోతుంది అని సారా అనగా ఆర్ జె నవ్వు ఆపుకోలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X