»   »  కష్టాల్లో సారా ఆలీఖాన్.. కోర్టు మెట్లు ఎక్కించిన తొలి చిత్రం!

కష్టాల్లో సారా ఆలీఖాన్.. కోర్టు మెట్లు ఎక్కించిన తొలి చిత్రం!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Sara Ali Khan Struck In A Case

    బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కుమార్తె కోర్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తొలి చిత్రంతోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తున్నది. తమతో ఒప్పందం కుదుర్చుకొన్న సైరా తమకు డేట్స్ కేటాయించకుండా మరో చిత్రానికి పనిచేస్తున్నదని కేదార్‌నాథ్ చిత్ర నిర్మాతలు ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే..

    బాలీవుడ్‌లో సారా అలీఖాన్

    బాలీవుడ్‌లో సారా అలీఖాన్

    సైఫ్ ఆలీఖాన్, అమృతాసింగ్‌ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్‌లో కేదారినాథ్ చిత్రంతో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టింది. గత సెప్టెంబర్ 2017లో కేదారినాథ్‌ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ చిత్రం ఆగిపోయింది. అందుకు కారణం సారానే కారణమని నిర్మాత అభిషేక్ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

     బాంబే హైకోర్టులో విచారణ

    బాంబే హైకోర్టులో విచారణ

    కేదారినాథ్ చిత్రానికి సంబంధించిన కేసు శుక్రవారం బాంబే హైకోర్టులో విచారించారు. కేదారినాథ్ చిత్రం పూర్తి చేసిన తర్వాత మరో చిత్రంలో నటించాలని నిర్మాత తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

    సింహా చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌తో

    సింహా చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌తో

    ప్రస్తుతం సింహా చిత్రంలో సారా అలీఖాన్ నటిస్తున్నది. ఈ చిత్రం తెలుగులో పూరి జగన్నాథ్ రూపొందించిన టెంపర్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఏ మేరకు షూటింగ్‌కు పూర్తి చేయాల్సి ఉందని ఈ సందర్బంగా కోర్టు అడిగి తెలుసుకొన్నది.

    కేసు తదుపరి విచారణ

    కేసు తదుపరి విచారణ

    సారా కేసుపై రోజంతా విచారణ జరిగింది. ఇరువర్గాలు అవగాహనకు రాకపోవడంతో ఈ కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు. సుమారు 15 రోజులపాటు సారా షూటింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది అని కోర్టుకు వెల్లడించారు.

    English summary
    Kedarnath actor Sara Ali Khan and the makers of the film are at loggerheads with each other over her film Simmba. The Kedarnath makers, hence, dragged Sara to the Bombay High Court to stop her from working on another film and to direct her to complete her initial commitment. The case came up for hearing on Friday morning, before Justice SJ Kathawala, where Sara was represented by the law firm Naik and Naik.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more